Telangana Budget 2025: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా? – Telugu News | Revanth Reddy Government in Telangana Budget 2025 allocates this much amount for Rythu Bharosa scheme for farmers

Written by RAJU

Published on:

Telangana Budget 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత బడ్జెట్‌ కేటాయించారో చూద్దాం..

ఏ రంగానికి ఎంత బడ్జెట్?

  • రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులు
  • జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీప్రక్రియ మొదలు
  • 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేడెట్‌ స్కూల్స్‌
  • హాస్టళ్లలో డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ చార్జీలు 200 శాతం పెంపు
  • ఎకరానికి రైతుభరోసా రూ.12వేలు
  • రైతు భరోసా: రూ. 18,000 కోట్లు.
  • వ్యవసాయ రంగానికి : రూ.24,439 కోట్లు
  • రైతుకూలీ సంక్షేమానికి ఇందిరమ్మ ఆత్మీయభరోసా కింద రూ.12వేలు
  • సన్నవడ్లకు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నాం
  • ఆయిల్‌పామ్‌ సాగు పెంచేందుకు సబ్సిడీలు
  • త్వరలో 14,236 అంగన్‌వాడీల పోస్టుల భర్తీ
  • గృహజ్యోతి పథకంతో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి
  • రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
  • నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ల నిర్మాణం
  • ORR ఆనుకుని హైదరాబాద్‌ నాలుగువైపులా శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు
  • రూ.2 లక్షలలోపు రైతురుణాలు మాఫీ చేశాం
  • 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాఫీ
  • క్రీడలు రూ.465 కోట్లు
  • అడవులు – పర్యావరణం రూ.1023 కోట్లు
  • దేవదాయ శాఖ రూ.190 కోట్లు
  • హోంశాఖ రూ.10,188 కోట్లు
  • చేనేత రూ.371 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం రూ.3591 కోట్లు
  • పరిశ్రమల శాఖ రూ.3527 కోట్లు
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూ.774 కోట్లు
  • విద్యుత్‌ శాఖ రూ.21,221 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యం రూ.12,393 కోట్లు
  • మున్సిపల్‌ – పట్టణాభివృద్ధి 17,677 కోట్లు
  • నీటి పారుదల శాఖ రూ. 23,373 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖ రూ. 5907 కోట్లు
  • పర్యాటక శాఖ రూ.775 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం రూ.40,232 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం రూ.17,169 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.11,405 కోట్లు
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి రూ. 31605 కోట్లు
  • మహిళా శిశుసంక్షేమం రూ.2862 కోట్లు
  • పశుసంవర్థక శాఖ రూ.1674 కోట్లు
  • పౌరసరఫరాల శాఖ రూ.5734 కోట్లు
  • విద్యాశాఖ రూ.23,108 కోట్లు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Subscribe for notification