తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత.. వెంటనే సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభను ఎంతకాలం నిర్వహించాలనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. గవర్నర్ ప్రసంగం పై గురువారం చర్చ జరగనుంది.. ఈనెల 15 నుంచి 18వరకు కులగణనపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చలు జరనున్నాయి.. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రాలుగా అధికారపక్షం బరిలోకి దిగుతుండగా.. ప్రజాసమస్యలపై గొంత్తెత్తాలని బీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది.. ఇక బీజేపీ సూపర్ సిక్స్‌పై అస్త్రాలను రెడీ చేసుకుంటోంది.. ఇలా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగనున్నాయి..
అసెంబ్లీలో త్రిముఖ సమరం..
కాగా.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో త్రిముఖ సమరం జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టే వ్యూహంతో చాలా గ్యాప్ తర్వాత సభకు కేసీఆర్ హాజరవుతున్నారు. ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిధ్దమైంది.. కేంద్రం ఇచ్చిన నిధులు ప్రాజెక్టుల లెక్కలతో కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. మరోవైపు విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అంటున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికార పార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ సాక్షిగానే తేల్చుకుంటామంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..