
ఇతను విచిత్ర కరడుగట్టిన అంతరాష్ట్ర దొంగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 90 కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు. మార్చి 10వ తేదీన కానిస్టేబుల్‌పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి పరారైన ఓ అంతర్రాష్ట్ర క్రిమినల్‌ను పోలీసులు పట్టుకుని జైలుకు పంపారు. మూడు నెలలు వ్యవధిలో 43 నేరాలకు పాల్పడిన దొంగను పట్టుకుని పెద్ద మొత్తంలో నగదు, బంగారాన్ని రికవరీ చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులో మార్చి10వ తేదీన నరేష్ అనే కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పారిపోయిన ఏపీకి చెందిన అంతర్రాష్ట్ర దొంగ తిరువిధుల సురేందర్‌ను పోలీసులు పట్టుకున్నారు. న తల్లికి చీర కొనడానికి 300 రూపాయల కోసం దొంగతనం మొదలుపెట్టాడుసురేందర్. ఆ తర్వాత వరుసగా దొంగతనలు చేసి.. కరడు గట్టిన దొంగ గా మారాడు. గడిచిన మూడు నెలల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాలలో 43 నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 90 చోరీ కేసుల్లో నిందితుడు.. ఓ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్ ఉన్న సురేందర్ ఈ ఏడాది జనవరి 25వ తేదీన బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఆ తరువాత సురేందర్ అనేక నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. చోరీలకు పాల్పడే సమయంలో టెక్నాలజీని ఉపయోగించి, ధనవంతులు ఇళ్లు టార్గెట్ చేసుకుని.. చోరీలు చేస్తాడు. నేరం చేసిన అనంతరం దోచుకున్న నగదు, బంగారాన్ని దగ్గరలోని స్మశాన వాటికలో దాచి.. అక్కడే పడుకుంటాడు. ఆ తరువాత వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. సురేందర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుండి 461.8 గ్రాముల బంగారం, 429 గ్రాముల వెండి,3.37 లక్షల నగదు, రెండు బైక్‌లు, ఒక మొబైల్ ఫోన్ ను మొత్తం 45 లక్షల రూపాయల విలువ గల ప్రాపర్టీని రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అతనిపై పీడీ యాక్ట్ నమోదయ్యేలా చేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంతరాష్ట్ర దొంగ సురేందర్ ను పట్టుకున్న సత్తుపల్లి పోలీస్ టీంను సిపి సునీల్ దత్ అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..