Telangana: శభాష్ పోలీస్.. కానిస్టేబుల్ పై దొంగ కత్తితో దాడి.. రక్త మోడుతున్నా..దొంగను వదలని పోలీస్ – Telugu News | Constable stabbed multiple times while trying to nab thief in Sathupalli Khammam district

Written by RAJU

Published on:

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో అంతర్ రాష్ట దొంగ పోలీస్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఐడి పార్టీ కానిస్టేబుల్‌ నరేష్ పై అంతర్ రాష్ట్ర దొంగ 9 కత్తి పోట్లు పొడిచాడు. సత్తుపల్లి లో పలు చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్న సురేందర్.. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం రాత్రి సత్తుపల్లి బస్టాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ.. ఉండటంతో పోలీసులకు సమాచారం వచ్చింది..

బస్ స్టాండు ఆవరణలో ఉన్న ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ అనుమానాస్పదంగా తిరుగుతున్న అంతర్ రాష్ట్ర దొంగ తిరుగుతూ కనిపించాడు. అతను ఆంధ్రా లోని చాట్రాయి మండలం చిత్తపూరుకు చెందిన తిరువీధి సురేందర్ అనే అంతర్ రాష్ట్ర దొంగ గా గుర్తించిన ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ మరో కానిస్టేబుల్ తో కలిసి దొంగను పట్టుకునేందుకు బైకు పై వెంబడించారు. పోలీసులకు దొరక కుండా పారిపోతూ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళగానే కానిస్టేబుల్ నరేష్ పై ఒక్కసారిగా కత్తితో 9 సార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఎడమ కంటి నుదురు భాగంలో కత్తి లోతుగా దిగడంతో తీవ్ర రక్త స్రావం అయ్యింది…తల నుంచి ,శరీరం నుంచి 9 కత్తిపోట్లు ..గురై రక్తం కారుతున్నా..విధి నిర్వహణలో తన బాధ్యత ను మరువలేదు. దొంగ తో పోరాడుతూనే కుప్పకూలి పోయాడు..తన చేతిలో ఎలాంటి వెపన్ లేకపోవడంతో.. నిస్సహాయ స్థితిలో..ఉన్నా..దొంగను రెండు చేతులు గట్టిగా పట్టుకొని కదల నివ్వలేదు.. తన తోటి పోలీసులు వచ్చే వరకు..పారిపోకుండా పట్టుకొని అప్పగించి..రక్తం మడుగులో కుప్ప కూలాడు..

వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం సిపి సునీల్ దత్ .. అతన్ని పరామర్శించి.. చికిత్స వివరాలు డాక్టర్లు ను అడిగి తెలుసుకున్నారు. నరేష్ ధైర్య సాహసాలను ఖమ్మం పోలీస్ కమిషనర్, స్థానికులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification