Hyderabad: ఇద్దరు యువకుల మధ్య చిన్నగా మొదలైన వివాదం కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. హైదారాబాద్-హబీబ్ నగర్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లిలోని దర్గా యూసిఫిన్ లోపల హుస్సేన్, రియాన్ అనే ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంతో హుస్సేన్ అనే యువకుడు తన దగ్గర ఉన్న కత్తితో రియాన్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రియాన్‌ను ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. దాడికి పాల్పడిన హుస్సేన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వీరి మధ్య గతంలో ఉన్న గొడవలే ఈ ఘర్షణకు దారి తీసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పాటు యువకులకు గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాల అలవాటు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ప్రసిద్ధి గాంచిన దర్గా యూసిఫిన్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై స్థానిక ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దాడి ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువకులు విచక్షణ మరిచి ఇలా దాడులుకు పాల్పడడం సరైన పద్దతి కాదన్నారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారం లాంటి భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి డ్రగ్ కల్చర్ మంచిదికాదని తెలిపారు. నాంపల్లి పీఎస్ పరిధిలో మత్తపదార్థాలకు బానిసలవుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెగిపోతుందని… దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై గంజాయితో ఎవరైన పట్టుబడినా..ఎవరైనా మత్తు పదార్థాలు వాడుతున్నట్టు తెలిసినా..కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..