కొన్ని విషయాలు చూస్తూ ఉంటే బ్రహ్మం గారు చెప్పిన మాటలు నిజమేనేమో అనిపిస్తుంది. సాధారణంగా ఒక చెట్టు నీడలో మరొక చెట్టు ఎదగదు.. బతుకదు అని పెద్దల నానుడి. కానీ తాను ఎదగడమే కాకుండా తనతో పాటు మరో చెట్టు పెరిగేలా ఉతమిస్తుంది ఈ రావి చెట్టు. హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ రావి చెట్టులో నివసిస్తారని విశ్వాసం. అందుకు తగ్గట్లుగానే తనలో నుంచి మర్రి చెట్టుకు ప్రాణం పోసిన ఈ రావి చెట్టును చూసి జనం ఔరా అని చర్చించుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి గ్రామ శివారులో ఉన్న ఒక రావిచెట్టు నడి మధ్య నుంచి ఒక ఈత చెట్టు మొలకెత్తి పెద్దగా పెరిగింది. ఒక చెట్టు మొదలు నుండి వేరొక చెట్టు పెరగడం చాలా అరుదు. కానీ ఇక్కడ రెండు రకాల చెట్లు ఒకే చోట పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మన సంస్కృతిలో ఆయుర్వేద వైద్యంలో ఈ రెండు రకాల చెట్లకు ప్రత్యేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. మరో వైపు ఇదో వింతగా ఉందని జనాలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి అరుదైన సంఘటనలతో ప్రకృతి ఏదో సంకేతాలు పంపుతుందని మరికొంతమంది పండితుల వైపు పరుగులు తీస్తున్నారు. ఇలా ఒక్కో వింతను చూస్తూ ఉంటే బ్రహ్మం గారు చెప్పిన మాటలు నిజమే అనిపిస్తోంది.