Telangana: పేదల పిల్లలకు పెద్ద చదువులు.. విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ – Telugu News | Rs 11,000 crore for construction of Young India schools

Written by RAJU

Published on:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల విషయంలో కీలక ముందడుగు పడింది. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ. 11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది.

ఒక్కో గురుకుల పాఠశాలకు రూ. 200 కోట్లు చొప్పున పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇలాంటి స్కూల్స్ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో స్కూళ్లను నిర్మిస్తామని, టీచింగ్ స్టాఫ్‌ కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేశామన్నారు భట్టి. ప్రైవేట్‌ స్కూళ్లలో చదవలేని పిల్లలకు..కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పశువుల పాకల్లో పాఠశాలలు ఏర్పాటు చేసిందని విమర్శించారు. పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే దిశగా సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొంగులేటి తెలిపారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) కాంప్లెక్స్‌లు నిర్మించబడే నియోజకవర్గాల జాబితా దిగువన చూడండి:

  1. మంథని, పెద్దపల్లి జిల్లా
  2. హున్సాబాద్, సిద్దిపేట జిల్లా
  3. ఆందోల్ (SC), సంగారెడ్డి జిల్లా
  4. వికారాబాద్ (SC), వికారాబాద్ జిల్లా
  5. షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా
  6. కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా
  7. నల్గొండ, నల్గొండ జిల్లా
  8. వరంగల్ తూర్పు, వరంగల్ జిల్లా
  9. ములుగు (ST), ములుగు జిల్లా
  10. ఖమ్మం, ఖమ్మం జిల్లా
  11. పాలేరు, ఖమ్మం జిల్లా
  12. అచ్చంపేట్ (SC), నాగర్ కర్నూల్ జిల్లా
  13. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లా
  14. ఆసిఫాబాద్ (ST), కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
  15. బెల్లంపల్లి (SC), మంచిర్యాల జిల్లా
  16. భూపాలపల్లె, జయశంకర్ భూపాలపల్లె జిల్లా
  17. బోధన్, నిజామాబాద్ జిల్లా
  18. చంద్రాయణగుట్ట, హైదరాబాద్ జిల్లా
  19. చెన్నూర్ (SC), మంచిర్యాల జిల్లా
  20. చేవెళ్ల (ఎస్సీ), రంగారెడ్డి జిల్లా
  21. చొప్పదండి (SC), కరీంనగర్ జిల్లా
  22. దేవరకద్ర, మహబూబ్‌నగర్ జిల్లా
  23. ధర్మపురి (SC), జగిత్యాల జిల్లా
  24. డోర్నకల్ (ST), మహబూబాబాద్ జిల్లా
  25. గద్వాల్, జోగులాంబ గద్వాల్ జిల్లా
  26. స్టేషన్ ఘన్‌పూర్ (SC), జనగాం జిల్లా
  27. జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లా
  28. జగిత్యాల్, జగిత్యాల్ జిల్లా
  29. జుక్కల్ (SC), కామారెడ్డి జిల్లా
  30. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా
  31. కోదాడ, సూర్యాపేట జిల్లా
  32. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
  33. మక్తల్, నారాయణపేట జిల్లా
  34. మానకొండూర్, కరీంనగర్ జిల్లా (SC)
  35. మంచిర్యాల, మంచిర్యాల జిల్లా
  36. మెదక్, మెదక్ జిల్లా
  37. మేడ్చల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
  38. మునుగోడు, నల్గొండ జిల్లా
  39. నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా
  40. నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ జిల్లా
  41. నకిరేకల్ (SC), నల్గొండ జిల్లా
  42. నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా
  43. నారాయణపేట, నారాయణపేట జిల్లా
  44. నర్సంపేట, వరంగల్ రూరల్ జిల్లా
  45. నిజామాబాద్ (రూరల్), నిజామాబాద్ జిల్లా
  46. పర్కల్, వరంగల్ రూరల్ జిల్లా
  47. పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా
  48. పినపాక (ఎస్టీ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
  49. రామగుండం, పెద్దపల్లి జిల్లా
  50. సత్తుపల్లి (SC), ఖమ్మం జిల్లా
  51. తాండూరు, వికారాబాద్ జిల్లా
  52. తుంగతుర్తి (SC), సూర్యాపేట జిల్లా
  53. వనపర్తి, వనపర్తి జిల్లా
  54. వైరా (ST), ఖమ్మం జిల్లా
  55. ఇల్లందు (ST), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Subscribe for notification