Telangana: పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌..! – Telugu Information | Groom’s Convention Name Mistake Cancels Wedding ceremony in Adilabad

Written by RAJU

Published on:

సెల్‌ఫోన్‌ కాన్ఫరెన్సు కాల్‌ ఓ మోసగాడి బారి నుంచి ఓ యువతి జీవితాన్ని కాపాడింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మండలానికి చెందిన యువకుడికి మరో మండలానికి చెందిన యువతితో నెల రోజుల కిందట పెళ్లి నిశ్చయమైంది. వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో ఓ రోజు కాబోయే భర్తతో మాట్లాడేందుకు సదరు యువతి అతడికి ఫోన్‌ చేసింది. అప్పటికే అతడు మరో యువతితో ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఆ కాల్‌ను హోల్డ్‌లో పెట్టి ఈ కాల్‌ లిఫ్ట్‌ చేసి బైక్‌పై ఉన్నానని, మళ్లీ కాల్‌ చేస్తానంటూ పెళ్లి చేసుకోబోయే యువతికి చెప్పాడు. అనంతరం ఈ కాల్‌ను కట్ చేయబోయి అనుకోకుండా మెర్జ్‌ చేయడంతో కాన్ఫరెన్సు కాల్‌లో మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్న యువకుడి గుట్టు పెళ్లి చేసుకోబోయే యువతికి అర్ధమైంది.

వారిద్దరి మధ్య సాగిన సంభాషణను రికార్డు చేసిన వధువు ఆ ఫోన్‌ సంభాషణను పెద్దల ముందు ఉంచింది. దీంతో మరికొద్ది రోజుల్లో జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుని, కట్నం డబ్బులను తిరిగి తీసుకున్నారు. ఓ కాన్ఫరెన్సు కాల్‌ ఇలా ఓ యువతి జీవితాన్ని కాపాడటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification
Verified by MonsterInsights