AIIMS BIBINAGAR Senior Resident Recruitment 2025 : ఎయిమ్స్ బీబీనగర్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో 75 పోస్టులను భర్తీ చేయనుంది.
హైలైట్:
- ఎయిమ్స్ బీబీనగర్ రిక్రూట్మెంట్ 2025
- పలు విభాగాల్లో 75 పోస్టుల భర్తీకి ప్రకటన
- ఫిబ్రవరి 28 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది

ఇతర ముఖ్యమైన సమాచారం :
- మొత్తం సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 75
- ఖాళీలు భర్తీ చేయనున్న విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్ అండ్ సూపర్ స్పెషాలిటీస్, జనరల్ సర్జరీ అండ్ సూపర్ స్పెషాలిటీస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, పీడీయాట్రిక్స్ అండ్ నియోనెటాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహబిలిటేషన్, సైకియాట్రీ, రేడియో డయాగ్నోసిస్, ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
మరికొన్ని వివరాల్లోకెళ్తే..
- అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్, పీహెచ్డీ (ఎంఎస్సీ, ఎంబయోటెక్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: 28.02.2025 తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.
- దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2025
AIIMS : 4576 గ్రూప్ బీ, సీ ఉద్యోగాలు.. ఫిబ్రవరి 26 నుంచి రాత పరీక్షలు
AIIMS CRE Recruitment 2025 : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఇటీవల భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భారీ సంఖ్యలో గ్రూప్ సీ, గ్రూప్ డీ పోస్టులు (మొత్తం 4576) భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండర్, ల్యాబ్ అటెండర్ లా మొత్తం 66 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా ముగిసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2025 ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు డైరెక్ట్ లింక్ ఇదే.