Telangana: డిగ్రీ విద్యార్థులకు బోలెడు శుభవార్తలు చెప్పిన ఉన్నత విద్యామండలి – Telugu Information | Telangana: Diploma semester exams held for just for 50 marks from subsequent educational yr

Written by RAJU

Published on:

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వచ్చే అకడమిక్ (2025-26) నుంచి డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.  డిగ్రీలో ఇప్పటివరకు సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌కు 80 మార్కులు, ఇంటర్నల్‌కు​‌ 20 మార్కులు కేటాయించేవారు. UGC (యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్) స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కాలేజీల్లో మార్కుల కేటాయింపు 70:30గా మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇకపై సెమిస్టర్‌ ఎగ్జామ్స్ 50 మార్కులకే నిర్వహించనున్నారు. మిగిలిన 50 మార్కుల్లో… ప్రాజెక్టు వర్క్‌/అసైన్‌మెంట్‌కు 25 మార్కులు, మిడ్‌టర్మ్‌ ఎగ్జామ్స్‌కు 25 మార్కులు కేటాయింపు చేయనున్నారు. అంటే కంటిన్యువస్‌ అసెస్‌మెంట్‌ ప్యాటర్న్‌-క్యాప్‌ సిస్టమ్ అమలు చేయబోతున్నారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో .. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  ఛైర్మన్‌ ఆచార్య వి.బాలకిష్టా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో.. సిలబస్‌, ఎగ్జామ్స్, ఎంట్రన్స్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దోస్త్‌లో భాగంగా డిగ్రీలో 4 కేటగిరీల నుంచి 3 సబ్జెక్టులను ఎంచుకునే బకెట్‌ విధానంపై మీటింగ్‌లో సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ పద్దతి కారణంగా కొన్ని సబ్జెక్టులను అతి తక్కువ మంది, మరికొన్ని సబ్జెక్టులను అతి తక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేయడం ఇబ్బందికరంగా మారుతోందనే అభిప్రాయం పలువురి నుంచి వ్యక్తమైంది. దీంతో ఆ విధానాన్ని తొలగించి.. మార్పులు చేయాలని నిర్ణయించారు. UGC స్వయంప్రతిపత్తి కాలేజీల్లో బకెట్‌ విధానం అమలు, పర్యవేక్షణకు విధి విధానాలు త్వరలో రూపొందించనున్నారు.

ఇక డిగ్రీలోని 6 సెమిస్టర్ల షెడ్యూల్స్ ఫైనల్ చేశారు. ఫస్ట్ సెమిస్టర్‌ క్లాసెస్ జూన్‌ 16వ తేదీ నుంచి, పరీక్షలు నవంబరు 6వ తేదీ నుంచి మొదలవుతాయి. 3, 5 సెమిస్టర్ల క్లాసెస్ జూన్‌ 2 నుంచి, రెండు, 4, 6 సెమిస్టర్ల క్లాసెస్ నవంబరు 20 నుంచి స్టార్టవుతాయి.

సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు 

— లెక్చరర్స్ డిజిటల్‌ వేదికల ద్వారా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలు(ఎఫ్​డీపీ) నిర్వహిస్తారు. టీశాట్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకొని ట్రైనింగ్ ఇస్తారు.

— వచ్చే విద్యా సంవత్సరం నుంచి 20 శాతం మార్పులతో డిగ్రీలో కొత్త పాఠ్యాంశాలు చేర్చబోతున్నారు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ తదితర భవిష్యత్తు డిమాండ్‌ ఉన్న కోర్సులకు ప్రాధన్యత ఉండబోతుంది.

— అన్ని యూనివవర్సిటీలలో ఉమ్మడి విద్యా ప్రణాళికను అమలు ఉంటుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఏటా ఏప్రిల్‌ 30కి పూర్తిచేస్తారు. దీంతో వివిధ ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ నిర్వహణకు ఇబ్బంది ఉండదు.

–డిగ్రీలో కోర్సుల కన్వర్షన్‌ చేసుకోవాలంటే ఈ సంవత్సరం అవకాశం ఇస్తారు.

— తెలంగాణలోని వివిధ వర్సిటీలలో సంప్రదాయ పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే సీపీగెట్‌ నిర్వహణ బాధ్యతలను మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అప్పగిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Subscribe for notification
Verified by MonsterInsights