
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లాయిబోడు తండాలో ఈ విషాదం జరిగింది.. భూక్య వెంకన్న – జ్యోతి దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం. రెండవ తరగతి చదువుతున్న అనిల్ అనే 10 ఏళ్ల బాలుడు మధ్యాహ్నం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కిరాణా దుకాణంలో చాక్లెట్ తీసుకోవడం కోసం వెళ్ళాడు. చాక్లెట్ తీసుకొని వస్తున్న సమయంలో గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్తున్న టిప్పర్ ఆ కిరాణం దగ్గర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అనిల్ ఢీ కొట్టింది.. ప్రమాదవశాత్తు బాలుడు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.. గమనించిన తండావాసులు వాహనం డ్రైవర్‌ను పట్టుకోగా.. అతను మద్యం మత్తులో ఉండడంతో దాడి చేశారు.
చాక్లెట్ కోసం వెళ్ళిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఊరంతా కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. బాలుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..