హైదరాబాద్, ఏప్రిల్ 30: బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్‌కి ఘాటైన వ్యాఖ్యలతో ధీటైన జవాబిచ్చారు. బుధవారం నాడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎన్ని బస్సులు కావాలంటే.. అన్ని బస్సులు ఇవ్వాలని చెప్పామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ సభలో ప్రభుత్వానికి ఏవైనా సూచనలు.. సలహాలు ఇస్తారని భావించామని.. కానీ అలా జరగలేదన్నారు సీఎం.
ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు..
ప్రతిపక్ష అయిన కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని.. ఆ పార్టీ నేతలకు ప్రజా సమస్యలు పట్టవా అని సీఎం ప్రశ్నించారు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా.. ఫాంహౌస్‌లో ఉంటూ.. రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేసీఆర్‌ను సీఎం ప్రశ్నించారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని.. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అవుతారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. గత పదేళ్లు కోతుల గుంపునకు ఇచ్చినట్లైందంటూ సీఎం తీవ్ర విమర్శలు చేశారు. ఏ అంశంపై నైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్.. కేసీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమ నిర్ణయాల్లో ఏవైనా లోపాలుంటే చెప్పాలన్నారు. పదేళ్లు మీరు దోచుకుని.. మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యోగం ప్రజలు ఎందుకు పీకేశారో అర్థం కాలేదా అని అన్నారు.
కేసీఆర్.. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా.. అధికారంలో లేకపోతే గాలికొదిలేసి పోతారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ తెచ్చిన ఏ పథకం ఆగిందో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం, రుణమాఫీ, ఉద్యోగాలపై చర్చిద్దామని.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్ చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కేసీఆర్‌కు కనిపించడం లేదా అని సీఎం ప్రశ్నించారు.
Also Read:
పాక్ నటికి భారత అభిమాని గిఫ్ట్..వైరల్ వీడియో
ప్లేఆఫ్స్‌కు కౌంట్‌డౌన్ షురూ
చేత్తొ కొట్టగానే షాకిచ్చిన ఫ్యాన్.. చివరకు చూస్తే..
For More Telangana News and Telugu News..
Updated Date – Apr 30 , 2025 | 04:25 PM