కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనొద్దంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తి చేంసింది. అయితే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనొద్దని..ఎవరైనా కొంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ఆ భూములను వాపస్ తీసుకుంటామన్నారు కేటీఆర్.
అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మిన ప్రభుత్వ భూముల వివరాలను వెలికి తేసే పనిలో రేవంత్ సర్కార్ పడింది. గత ప్రభుత్వం ఎవరెవరికి భూములు అమ్మకం.. ఆ భూములను కొన్నవారెవరనే దానిపై ఆరా తీస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేసిన వారికి నోటీసులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..