తెలంగాణ (Telangana) రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ)-ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ ఐసెట్) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఫుల్ టైం, పార్ట్ టైం, ఈవెనింగ్, డిస్టెన్స్, ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానాల్లో ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ పరీక్షని వరంగల్‌లోని (Warangal) కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల (Telugu states) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తున్న వర్సిటీలు
-
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్
డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్
-
జవహర్‌లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్
-
ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
-
కాకతీయ యూనివర్సిటీ, వరంగల్
-
మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్లగొండ
-
పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్
-
శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్
-
తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్
అర్హత వివరాలు
ఎంబీఏలో ప్రవేశానికి ద్వితీయశ్రేణి మార్కులతో బీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంసీఏలో ప్రవేశానికి మేథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్)/ బీసీఏ/ బీఎస్సీ/ బీకాం/ బీఏ పూర్తిచేసి ఉండాలి.
ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు; డిస్టెన్స్/ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానాల్లో డిగ్రీ చదివినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.
అభ్యర్థుల వయసు దరఖాస్తు నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.
టీఎస్ ఐసెట్ వివరాలు: పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 200. డేటా సఫిషియెన్సీ నుంచి 20 ప్రశ్నలు, ప్రాబ్లం సాల్వింగ్ (సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డేట్, టైం, అరేంజ్‌మెంట్) అంశాల నుంచి 55 ప్రశ్నలు, మేథమెటికల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు, కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. కమ్యూనికేటివ్ ఎబిలిటీ ప్రశ్నలను ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఇస్తారు. మిగిలిన ప్రశ్నలను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దు మాధ్యమాల్లో ఇస్తారు. టీఎస్ ఐసెట్ 2023లో అర్హత సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.550
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 6
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నల్లగొండ, నర్సంపేట్, నిజామాబాద్, సంగారెడ్డి, సత్తుపల్లి, వరంగల్, కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం
టీఎస్ ఐసెట్ 2023 తేదీలు: మే 26, 27
వెబ్‌సైట్: https://icet.tsche.ac.in
ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!
Updated Date – 2023-03-07T17:30:55+05:30 IST