Telangana: ఎందుకు దేవుడా ఇలా చేశావ్..! ఒక్క పల్లిగింజ ఆ బాలుడి ఉసురు తీసింది.. – Telugu News | 18 month old boy dies after peanut got stuck in his throat in Gudur, Mahabubabad district.

Written by RAJU

Published on:

మహబూబాబాద్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గొంతులో పల్లి (వేరుశనగ) గింజ ఇరుక్కుని 18 నెలల బాలుడు మృతి చెందాడు.. పల్లిగింజ గొంతులో ఇరుకోవడంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ బాలున్ని తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.. కానీ ఫలితం దక్కలేదు.. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్ పల్లిలో జరిగింది. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు..

నాయక్ పల్లి గ్రామానికి చెందిన వీరన్న – కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు… ఏడాదిన్నర వయస్సు గల బాలుడు అక్షయ్ ఈనెల ఏడవ తేదీన శుక్రవారం ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు.. ఈ క్రమంలోనే.. ఇంటి ముందు ఆరబెట్టిన పల్లి గింజలు తినడానికి ప్రయత్నించాడు.. ఆ పలిగింజలు గొంతులో ఇరుక్కుని శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ బాలుడిని చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు..

18 Month Old Boy Dies After

Boy Dies in Gudur

పల్లి గింజలు మింగి ఉంటాడని గమనించిన తల్లిదండ్రులు అక్కడి నుండి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.. కానీ పరిస్థితి విషమించిందని ఎంజిఎంకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడి నుండి 108 లో ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు.. కానీ ఫలితం దక్కలేదు..అప్పటికే.. మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

వీడియో చూడండి..

18 నెలల బాలుడికి ఆ పల్లి గింజల రూపంలో నూరేళ్లు నిండాయంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification