
జనగామ జిల్లా ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. శామీర్‌పేట్ గ్రామ శివారులో మధ్యయుగం కాలం నాటి విగ్రహం ఒకటి బయటపడింది. బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఈ విగ్రహం బయటపడట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. శామీర్‌పేట్ గ్రామ శివారులో ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు తవ్వకాలు జరుపుతుండగా.. మట్టిలో ఒక్కసారిగా మెరుస్తూ పురాతన విగ్రహం ఒకటి కనిపించింది. దానిని వెలికితీసి ఆశ్చర్యపోయారు. అదొక మధ్యయుగం నాటి ఓ దేవత విగ్రహంలా ఉంది. స్థానికంగా ఉన్న చరిత్ర పరిశోధకులకు చూపించగా.. అది మధ్యయుగం కాలంనాటి విగ్రహం అయ్యి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాగా, పురాతన విగ్రహం లభ్యం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున చూసేందుకు తరలివచ్చారు.