ఇప్పుడు పంటలు సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. వరి మినహా.. ఇతర పంటలు సాగు చేయాలేకపోతున్నారు. ఇప్పుడు వరిపై కూడా దాడి చేస్తున్నాయి. వరి చేలపై దాడి చేస్తున్న వానరాలు, పొట్ట దశలోనే తింటున్నాయి. కోతులు భయానికి.. కూరగాయాలతో పాటు వేరుశనగ, మొక్కజొన్న, కందులు, పెసర్లు, మినుములు లాంటి పంటలు వేయలేకపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులకు కొత్త సమస్య తలెత్తుతోంది. దాదాపు 250కు పైగా గ్రామాల్లో కోతులు బెడద తీవ్రమైంది. ఇటీవల గ్రానైట్ తవ్వకాల కారణంగా కొండల్లో ఉండాల్సిన కోతులు గ్రామాల్లోకి చేరిపోయాయి. ఇక తిండి కోసం యుద్ధం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో వీటి సంతానం భారీగా పెరిగిపోయింది. మనుషుల కంటే.. కోతుల సంఖ్యనే ఎక్కువగా కనబడుతుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో.. వేరుశనగ, మొక్కజొన్న, కంది, పెసర్లు, బబ్బెర్లు, మినుము, ఇతర ఆరుతడి పంటలను సాగు చేసేవారు. ఇటీవల మొక్కజొన్న మినహా మిగతా పంటలకు మద్దతు ధరను పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పంటలను సాగు చేద్దామంటే, కోతులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పంటలు సాగు చేసే అవకాశం ఉన్న ఎర్ర నేల భూములు కూడా.. నారుమల్లుగా మారిపోతున్నాయి. అంతేకాదు, ఇప్పుడు బీడుగా పెడుతున్నారు. భారీ వర్షం కురిస్తే మాత్రం నాటు వేయనున్నారు. ఆరు తడి పంటలు వేయాలంటేనే రైతులు జంకుతున్నారు.
పంటపొలాలపై కోతులు దాడి చేసి నాశనం చేస్తున్నాయి. ఒక్క వేళా విత్తనాలు వేసిన వెంటనే తినేస్తున్నాయి. కష్టంగా కాపాడిన.. పంట చేతికి వచ్చే సమయంలో మళ్లీ దాడులు చేసే తినేస్తున్నాయి. దాదాపు ఇలాంటి పంటలను సాగు చేయడం మానేశారు రైతులు. ఒక కూరగాయల సాగు కూడా చేయడం లేదు. కూరగాయాలు చేతికొచ్చే సమయానికి.. మొత్తం తినేస్తున్నాయి కోతులు. చివరకు.. మిర్చిని కూడా తింపి కింద పడవేస్తున్నాయని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. ముఖ్యంగా మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం. చిగురుమామిడి, రామడుగు, గంగాధర, మల్యాల, కొడిమ్యాల తదితర మండలాల్లో అధికంగా ఉన్నాయి కోతులు.
కోతుల భయానికి ఇతర పంటలు వేస్తున్నారు రైతులు. ఈ సంవత్సరం కోతుల ప్రభావం ఉన్న గ్రామాల్లో వరి మినహా.. ఇతర పంటలు వేయడం లేదు. పప్పుదినుసులకు మద్దతు ధర ఉన్నా.. సాగు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కోతులను పట్టుకుని దట్టమైన ప్రాంతాల్లో వదిలిపెట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు. కోతుల కారణంగా కూరగాయాల సాగుతో పాటు వరి మినహా.. ఇతర పంటలను సాగు చేసుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. కోతులను తరిమేసిన పంటలను కాపాడాలని రైతన్నలు వేడుకుంటున్నారు..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..