ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్) పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/బీఈడీ/బీఈఎల్‌ఈడీ/పీజీ/డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణత. సీటెట్, టెట్‌లో అర్హత సాధించాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్ర్కీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉం టుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ: సెప్టెంబరు 10
వెబ్‌సైట్: https://awesindia.com/