ABN
, Publish Date – Apr 09 , 2025 | 06:21 PM
TDP Leaders: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను బుధవారంనాడు తెలుగుదేశం నాయకులు కలిశారు. సాక్షి మీడియాపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.

TDP Leaders Complaint AP DGP
అమరావతి: సాక్షి తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు తెలుగుదేశం నేతలు ఇవాళ (బుధవారం) ఫిర్యాదు చేశారు. డీజీపీని తన కార్యాలయంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, బుచ్చి రామ్ ప్రసాద్ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భగా వేమూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడారు. మీడియా రంగంలో సాక్షి ఓ కలుపు మొక్క అని విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటైన సాక్షి మీడియా పుట్టుక నుంచి అసత్యాలే రాస్తోందని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు.
పల్నాడు జిల్లాలో జరిగిన హత్యను తెలంగాణలో ఒక లాగా ఏపీలో మరోలా ప్రచురించడం ఆ మీడియా రాజకీయంగా పబ్బం గడిపే తీరుకు అద్దంపడుతోందని నక్కా ఆనంద్ బాబు చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు అప్రమత్తమై సాక్షి తప్పుడు కథనాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఖచ్చితమైన చర్యలకు డీజీపీ హామీ ఇచ్చారని అన్నారు. ప్రజలు ఓడించినా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ద్వారా అసత్యాలనే ఇంకా ప్రచారం చేస్తున్నారని నక్కా ఆనంద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
Big Shock To Kakani: కాకాణి బెయిల్.. నో చెప్పిన హైకోర్టు
Read Latest AP News And Telugu News
Updated Date – Apr 09 , 2025 | 06:28 PM