పిల్లల భవిష్యత్తు కోసం తెలివిగా పెట్టుబడి పెట్టడానికి వారి పొదుపులను పెంచడమే కాకుండా పన్ను బాధ్యతలను తగ్గించే వ్యూహాత్మక విధానం అవసరమని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులను వైవిధ్యపరచడంతో పాటు పన్ను సమర్థవంతమైన ఎంపికలను ఉపయోగించడం వల్ల పెద్ద మొత్తంలో నిధులను పొదుపు చేయవచ్చని చెబుతున్నారు. ఈఈఈ, ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ కింద వర్గీకరించబడిన పథకాలు గణనీయమైన పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. ఆ పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన
ఈ రెండు పథకాలు ప్రభుత్వ మద్దతుతో వచ్చే అత్యంత సురక్షితమైన పథకాల్లో ఈ పథకాల్లో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మొత్తాలను మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి మినహాయించవచ్చు. ఉపసంహరణ తర్వాత అసలు మొత్తం, వడ్డీ రెండూ పన్ను మినహాయింపు పొందుతాయి. ఈ రెండు పథకాలు ఈఈఈ పెట్టుబడిగా ఉంటాయి. అయితే సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్
ఈ రెండు పథకాలు ఉపసంహరణపై వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. అయితే పెట్టుబడిపై పన్నులను ఆదా చేయడానికి ఎన్ఎస్‌సీ ఆకర్షణీయమైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. సెక్షన్ 80సీ కింద మీరు 1.5 లక్షల వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. మరోవైపు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీలో 10,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్
మీరు పన్నులను ఆదా చేస్తూ మీ పెట్టుబడిని అధిక రేటుతో పెంచుకోవాలనుకుంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లు మంచి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఇవి సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను రాయితీని అందిస్తాయి. ఈఎల్ఎస్ఎస్‌లు అత్యధిక రాబడిని అందించే పెట్టుబడి ఎంపికల్లో ఒకటిగా ఉంటుంది. కానీ ఎఫ్‌డీ, ఎన్ఎస్‌సీతో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్‌లు అధిక రిస్క్‌తో ఉంటాయి. అలాగే మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి.
యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్
పన్ను ఆదా ముఖ్యం అయినప్పటికీ ఊహించని సంఘటనలకు సిద్ధం కావడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి స్కీమ్స్‌లో యూఎల్ఐపీలు మొదటి స్థానంలో ఉంటాయి. యూఎల్ఐపీలు పెట్టుబడి, బీమాను కలిపి మార్కెట్-లింక్డ్ రాబడిని జీవిత బీమాతో పాటు అందిస్తాయి. మీరు సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ.1.5 లక్షలు ఆదా చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా మెచ్యూరిటీతో పాటు మరణ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి