టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మే 21న లాంచ్ చేయబోతోంది. ఈ మేరకు కంపెనీ వర్గాలు విశ్వసనీయ సమాచారాన్ని అందించాయి. టాటా ఆల్ట్రోజ్ అనేది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. దీనిని క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా సంప్రదాయ ఆల్ట్రాోజ్ కార్ల కంటే ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారు డిజైన్‌లో మార్పు ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక ఫీచర్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇటీవల ఈ టాటా కారుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కారు ఫ్రంట్ వ్యూ చాలా అధునాతనంగా ఉంది. టాటా నెక్సాన్, హారియర్ లుక్‌లో కనిపించే ఈ కారు విడుదలైతే ఆ కార్లకు గట్టి పోటినివ్వనుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కారు గ్రిల్, బంపర్ కారుకు స్పోర్టీ లుక్‌ను ఇస్తున్నాయి.
అలాగే టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కారులో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు. టాటా కొత్త ఆల్ట్రోజ్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. వెంటిలేటెడ్ సీట్ల కోసం కూడా కొత్త ఎంపికలు ఉంటాయి. ఇంజిన్ విషయానికి వస్తే పెట్రోల్, డీజిల్, సీఎన్జీలలో పెద్దగా మార్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు. అధునాతన ఏడీఏఎస్ వ్యవస్థ ఈ కారు ప్రత్యేకత. టాటా ఆల్ట్రోజ్ మారుతి సుజుకి బాలెనో, స్విఫ్ట్ లకు ప్రత్యక్ష పోటీని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కొత్త డిజైన్ (పదునైన హెడ్లైట్లు, అప్డేటెడ్ గ్రిల్, 6 ఎయిర్‌బ్యాగులు వంటి భద్రతా లక్షణాలతో ఆల్ట్రోజ్ కొనుగోలుదారులు దీనిని బాలెనో, స్విఫ్ట్ కంటే మెరుగైన ఎంపికగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మారుతి మోడళ్ల ఇంధన సామర్థ్యం, బ్రాండ్ నమ్మకంతో పోలిస్తే టాటా ధర, ఏడీఏఎస్ వంటి లక్షణాలు అధునాతనంగా ఉంటాయి. ఈ విభాగంలో సాంకేతికత, డిజైన్ మాత్రమే గేమ్-ఛేంజర్లుగా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి