Tariff conflict escalates.. China will increase tariffs on American items by 125%..

Written by RAJU

Published on:

  • అమెరికా, చైనాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం..
  • అమెరికన్ వస్తువులపై 125 శాతం సుంకాలు పెంచిన చైనా..
  • యూఎస్‌కి ప్రతిస్పందనగా చైనా నిర్ణయం..
Tariff conflict escalates.. China will increase tariffs on American items by 125%..

Tariffs War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డొనాల్డ్ ట్రంప్ చైనాని టార్గెట్ చేస్తూ సుంకాలను పెంచారు. మిగతా ప్రపంచ దేశాలకు అమెరికా మూడు నెలలు పాటు టారిఫ్స్‌ని నిలిపేసింది. కానీ, చైనాకు మాత్రం అమెరికా ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. చైనా ఉత్పత్తులపై యూఎస్ విపరీతమైన సుంకాలను విధించింది. ఇదిలా ఉంటే, చైనా కూడా అంతే ధీటుగా అమెరికా వస్తువులపై సుంకాలను పెంచుతూ పోతోంది. తాజాగా, యూఎస్ వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతామని చైనా శుక్రవారం తెలిపింది.

Read Also: Tamil Nadu: తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నాగేంద్రన్.. రేపు ప్రకటించే ఛాన్స్!

మరోవైపు, శనివారం నుంచి చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాలు 145 శాతం అమలులోకి వస్తున్నాయి. అమెరికా నిర్ణయానికి ధీటుగా చైనా కూడా స్పందిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇదిలా ఉంటే, అమెరికా టారిఫ్ దెబ్బకు కలిసి పనిచేద్ధామని భారత్‌ని చైనా కోరింది. అమెరికా సుంకాలను అడ్డుకోవాలని చెప్పింది. తాజగా, యూరోపియన్ యూనియన్‌కి చైనా కలిసి పనిచేయాలని, అమెరికా నుంచి ఎదురవుతున్న వాణిజ్య యుద్ధం నుంచి బయటపడటానికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. చైనా పర్యటనలో ఉన్న స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. “చైనా మరియు యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాలి, ఏకపక్ష బెదిరింపు పద్ధతులను సంయుక్తంగా నిరోధించాలి” అని చైనా అధ్యక్షుడు చెప్పారు.

అంతకుముందు, భారత్‌ కూడా అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలని చైనా కోరింది. డ్రాగన్, ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలని జిన్‌పింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కోరాడు. చైనా భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాల ఆధారంగా ఉన్నాయని, ఆమెరికా సుంకాల దుర్వినియోగం చేస్తోందని, ఇది ఇరు దేశాల అభివృద్ధి హక్కును, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలతో కలిసి నిలబడాలని అని ఇండియాలో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights