Tamil Nadu BJP Chief Annamalai Criticizes TVK Party President Vijay

Written by RAJU

Published on:

  • టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ పై అన్నామలై ఫైర్
  • విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడు- అన్నామలై
  • స్కూల్ పిల్లలు లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడు
  • సినిమా షూటింగ్ నుండి రాజకీయ చేస్తారా- అన్నామలై.
Tamil Nadu BJP Chief Annamalai Criticizes TVK Party President Vijay

టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌పై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్క్ ఫ్రమ్ హోం పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. స్కూల్ పిల్లలు లాగా ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సినిమా షూటింగ్ నుండి రాజకీయ చేస్తారా.. నాటకాలు ఎవరు ఆడుతున్నారని అన్నామలై ప్రశ్నించారు. విజయ్‌కు 50 ఏళ్ళు వచ్చాక రాజకీయాల్లోకి రావాలని అనిపించిందా..? అని అడిగారు. 30 ఏళ్ళ వయసులో విజయ్ ఎక్కడ ఉన్నాడు‌.. ఏం చేస్తున్నాడన్నారు.

Read Also: Lips Care: నల్లబారిన పెదవులను గులాబీ రంగులోకి ఎలా తెచ్చుకోవాలంటే?

డ్రామాలు ఆడుతోంది విజయ్‌.. బీజేపీ కాదన్నారు అన్నామలై. డీఎంకే పార్టీకి ‘బి టీం’ విజయ్ అని ఆరోపించారు. డీఎంకే మళ్ళీ అధికారంలోకి రావాలనే సీక్రెట్ ప్లాన్‌లో భాగంగా విజయ్ టివికే పార్టీ పనిచేస్తోందని అన్నారు. పరిధి దాటి విజయ్ మాట్లాడే ముందు అలోచించి మాట్లాడాలి‌.. మర్యాద ఇచ్చి మర్యాద తీసుకో అని సూచించారు. ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయి.. షూటింగ్ చేస్తూ ఓ లేటర్ రాసి పంపేది కాదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు విజయ్‌కు ఏం తెలుసని అన్నామలై ప్రశ్నించారు.

Read Also: IPL: ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకూ పెద్ద వివాదాలు ఏంటంటే..?

మరోవైపు.. ముఖ్యమంత్రి స్టాలిన్‌పై అన్నామలై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్టాలిన్ ఎందులోనో భయపడుతున్నాడు.. అందువల్లే బీజేపీపై అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. సీఎం స్టాలిన్ ఈడీ దాడుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ డ్రామాలు ఆడుతున్నాడని అన్నామలై ఆరోపించారు. వారి సింబల్ డ్రామా, బడ్జెట్ డ్రామా అన్నీ ఈడీ దాడుల నుండి దృష్టిని మళ్లించేందుకేనని పేర్కొన్నారు.

Subscribe for notification