T20 Cricket: ‘సూపర్ ఓవర్’ థ్రిల్లర్ మ్యాచ్ అంటే ఇదే భయ్యో.. జీరోకే ఆలౌట్.. టీ20 చరిత్రలో చెత్త రికార్డ్..!

Written by RAJU

Published on:


Hong Kong Defeat Bahrain in the Super Over: కౌలాలంపూర్‌లో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లోని 5వ మ్యాచ్ ఉత్కంఠభరితమైన పోరాటానికి సాక్ష్యంగా నిలిచింది. బయుమాస్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బహ్రెయిన్ వర్సెస్ హాంకాంగ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ తరపున జీషన్ అలీ 29 పరుగులు చేయగా, షాహిద్ వాసిఫ్ 31 పరుగులు చేశాడు. దీంతో హాంకాంగ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

130 పరుగుల సులభమైన లక్ష్యాన్ని ఛేదించే బహ్రెయిన్ తరపున వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ప్రశాంత్ కురుప్ 31 పరుగులు చేశాడు. కెప్టెన్ అహ్మర్ బిన్ నాసిర్ 24 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అయితే, చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి.

నస్రుల్లా రాణా వేసిన 20వ ఓవర్‌లోని మొదటి 5 బంతుల్లో బహ్రెయిన్ బ్యాటర్లు 12 పరుగులు చేశారు. కానీ, చివరి బంతికి అహ్మర్ నాసిర్ అతన్ని ఔట్ చేశాడు. ఫలితంగా, మ్యాచ్ టైగా ముగిసింది.

ఇవి కూడా చదవండి

హాంకాంగ్- 129/7 (20), బహ్రెయిన్- 129/8 (20)

సూపర్ ఓవర్ థ్రిల్లర్..

మ్యాచ్ టై అయింది. కాబట్టి, ఫలితాన్ని నిర్ణయించడానికి సూపర్ ఓవర్ ఆడారు. దీని ప్రకారం, మొదట బ్యాటింగ్ చేసిన బహ్రెయిన్ తరపున అహ్మర్ నాసిర్, ఆసిఫ్ అలీ ఓపెనర్లుగా దిగారు.

హాంకాంగ్ బౌలర్ ఎహ్సాన్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్ తొలి బంతికి ఒక్క పరుగులు కూడా రాలేదు. రెండో బంతికే అహ్మర్ నాసిర్ (0) ఔటయ్యాడు. మూడో బంతికి సోహైల్ అహ్మద్ (0) కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. దీనితో, బహ్రెయిన్ జట్టు సూపర్ ఓవర్‌లో సున్నాకి ఆలౌట్ అయిన అవాంఛనీయ రికార్డును సృష్టించింది.

ఒక పరుగు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హాంకాంగ్ జట్టు మూడు బంతులు ఎదుర్కొంది. దీంతో, ఉత్కంఠభరితంగా సాగిన 0 పరుగుల సూపర్ ఓవర్ పోరాటంలో హాంకాంగ్ జట్టు చివరకు విజయాన్ని నమోదు చేసింది.

చెత్త రికార్డ్..

టీ20 క్రికెట్ చరిత్రలో సూపర్ ఓవర్‌లో ఒక జట్టు బ్యాటింగ్ చేసి 0 పరుగులు చేయడం ఇదే తొలిసారి. అలాగే, ప్రత్యర్థి జట్టుకు కేవలం 1 పరుగు లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో బహ్రెయిన్ జట్టు టీ20 క్రికెట్‌లో 0 పరుగులతో అవాంఛనీయ రికార్డును సృష్టించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Subscribe for notification