- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- మరోసారి అభిషేక్ జేబులు చెక్ చేసిన స్కై!

Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ముంబై ఇండియన్స్ (MI) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన అభిమానులను నవ్వించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది వరకు పంజాబ్ మ్యాచ్ లో వీరబాదుడు బాదిన అభిషేక్ శర్మ తన సెంచరీ పూర్తి అవ్వగానే తన జేబులో నుంచి ఒక లెటర్ తీసి చూపించిన విషయం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఇక ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్ లో అభిషేక్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చి అతని జేబులను చెక్ చేసాడు. అందుకు సంబంధించిన విషయం కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయితే బుధవారం మ్యాచ్ మొదలు కాకముందు ఇరుజట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ ఒకరినొకరు కౌగిలించుకున్న సందర్భంలో మామరోమారు ఈ ఘటన జరిగింది. సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ జేబుల్లో ఏదో వెతుకుతున్నట్లు కనిపించాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఒక అభిమాని తన కెమెరాలో బంధించి, సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియో షేర్ చేస్తూ, “సూర్య భాయ్ అభిషేక్ జేబుల్లో స్లిప్‌ల కోసం వెతుకుతున్నాడు” అని హాస్యాస్పద లైన్ రాసుకొచ్చాడు. దానితో ఈ పోస్ట్ కొద్దీ సేపట్లోనే తెగ వైరల్ అయ్యింది.
Surya bhai searching for slips in Abhishek’s pockets #srh #mumbai #mumbaiindians #sunrisers #surya #suryabhai #srh #SunrisersHyderabad #abhisheksharma #SRHvsMI pic.twitter.com/7nikPcYc0p
— Srikanth avasarala (@SrikanthAvasar2) April 23, 2025
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంత మైదానంలో ఆడినప్పటికీ, ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడుతో విజయం సాధించింది. గతంలో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కూడా ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడుతో సన్‌రైజర్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ సరదా సంఘటన అభిమానులకు మరపురాని క్షణంగా మిగిలిపోయింది.