Surprising Incident in Nagarkurnool: Lady Gang-Raped by Eight Males in Urukonda

Written by RAJU

Published on:

  • ఊరుకొండ మండలం ఊరుకొండ పేటలో ఘటన
  • దైవ దర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం
  • బంధువులతో కలిసి దైవదర్శనానికి వచ్చిన యువతి
  • గుట్టల ప్రాంతంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ అగంతకులు
Surprising Incident in Nagarkurnool: Lady Gang-Raped by Eight Males in Urukonda

నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బంధువులతో కలిసి వచ్చిన యువతిపై గుట్టల ప్రాంతంలోకి లాక్కెళ్లి 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో, ఆమెతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గ్రామస్థులు నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

READ MORE: UP: విషాదం.. అలహాబాద్ ఐఐఐటీ హాస్టల్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

కాగా.. మహిళలపై హింసాకాండ రోజురోజుకూ పెరుగుతోంది. సామాజిక అభివృద్ధి ఎంత జరిగినా, మహిళల భద్రత మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే, హత్యాచారాలు, లైంగిక దాడులు, వేధింపులు అనివార్యమైన విపత్తులుగా మారుతున్నాయి. మహిళలపై హింసను అరికట్టేందుకు నూతన చట్టాలు వచ్చినా, వాటి అమలులో పూర్తిస్థాయిలో సమర్థత కనిపించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం జరిగినప్పుడల్లా నిందితులకు కఠిన శిక్షలు ఖాయం విధించాలి. కానీ న్యాయ వ్యవస్థలో ఆలస్యం, సాక్షుల మళ్లింపు, ఒత్తిళ్లు బాధితులను మరింత హింసిస్తున్నాయి. ఒక మహిళ తన కుటుంబంతో గడపాల్సిన జీవితం దారుణమైన సంఘటనలకు బలవుతుండటం బాధాకరం. నేరస్తులకు సకాలంలో తగిన శిక్ష పడకపోవడం వారి ధైర్యాన్ని పెంచుతోంది.

READ MORE: Shane Warne: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడి మృతి కేసులో సంచలనం.. బెడ్ రూమ్ లో మిస్టరీ డ్రగ్?

Subscribe for notification
Verified by MonsterInsights