- కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
- వెంటనే పనులన్నీ ఆపేయాలని.. హైకోర్ట్ రిజిస్టర్ ఇచ్చిన నివేదికలో చాలా కీలక అంశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది
- ప్రభుత్వం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వెయ్యాలని ఆదేశించింది

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థిలోకం గర్జిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి కోసం చెట్లను నరికేసి భూములను వేలం వేయడాన్ని పర్యావరణవేత్తలు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. Hcu.. కంచ గచ్చిబౌలి స్థలాల్లో ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
Also Read:Hyderabad: అమీన్ పూర్ పిల్లల హత్య కేసులో తల్లి అరెస్టు..
వెంటనే పనులన్నీ ఆపేయాలని.. హైకోర్ట్ రిజిస్టర్ ఇచ్చిన నివేదికలో చాలా కీలక అంశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వం నెల రోజుల్లో నిపుణుల కమిటీ వెయ్యాలని ఆదేశించింది. 6 నెలలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని సూచించింది. ఫారెస్ట్ ను నాశనం చేసే ఆక్టివిటీ జరుగుతోంది. చెట్లు.. నెమళ్ళు.. పక్షులు.. వన్య ప్రాణులు ఉన్నాయి. వంద ఎకరాలను ఎలా కొట్టేశారు. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సీఎస్ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.