హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీగా ఉంది. క్రెటా 2024లో ఫేస్క్రిఫ్ట్ పొందగా ఇటీవల కంపెనీ క్రెటా లైనప్‌ను కొత్త ఫీచర్లు, వేరియంట్లతో అప్డేడేట్ చేసింది. 2025 అప్డేట్తో క్రెటా లైనప్ కొత్త ఈఎక్స్(ఓ) ట్రిమ్ లెవల్స్‌లో క్యాబిన్ కోసం పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఈ కారు పెట్రోల్ ఆప్షన్ ధర రూ.12.97 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ.14.56 లక్షలుగా ఉంది.
కియా సైరోస్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కారు. రూ.9 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే రూ.11.50 లక్షల్లో అందుబాటులో ఉండే సైరోస్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. సైరోస్ హెచ్టీకే ప్లస్ వైర్లెస్ ఫోన్ కనెక్టివిటీతో 12.30 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డైనమిక్ గైడ్ లైన్స్‌తో రివర్స్ కెమెరా, పవర్-అడ్జస్టబుల్ మిర్రర్లు, విండోస్, రియర్ ఏసీ వెంట్స్, డోర్ కర్టెన్లు, ఫోర్ టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌లతో పాటు రియర్ రిక్లైనింగ్ సీట్లతో ఆకట్టుకుంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ టాప్ ఎండ్ Aఎక్స్7 వేరియంట్లు పనోరమిక్ సన్‌రూఫ్‌తో లాంచ్ చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ.12.57 లక్షలు, ఎక్స్-షోరూమ్. సన్‌రూఫ్‌తో పాటు సబ్-కాంపాక్ట్ ఎస్యూవీ ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు 10.25 అంగుళాల డిజిటల్ డిస్ ప్లేలతో ఈ కారు ఆకట్టుకుంటుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్డ్ ఆపిల్ కార్ ప్లే ఈ కారు ప్రత్యేకత. స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం మహీంద్రా అడ్రినోక్స్ కనెక్ట్ ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది. డిస్ప్లేలతో పాటు వాహనంలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, సిక్స్ స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, మల్టీ ఛార్జింగ్ పాయింట్లు, కూల్డ్ గ్లోబ్బాక్స్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
2021లో లాంచ్ అయిన ఎంజీ ఆస్టర్ ఇటీవల కొత్త ఫీచర్లు, అప్డేటెడ్ వేరియంట్స్‌తో సరికొత్తగా వస్తుంది. ఎంజీ రెండో బేస్ మోడల్ అయిన షైన్ వేరియంట్ నుంచి ఆస్టర్ ప్యాకేజీలో పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఆస్టర్ షైన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌తో వచ్చే షైన్ వేరియంట్లో ఆరు స్పీకర్ల ఆడియో సెటప్ కూడా ఉంది.
ఎస్యూవీ విభాగంలో టాటా కర్వ్ తన మార్క్‌ను చూపుతుంది. ఈ విభాగంలో టాటా కర్వ్ కూ పే ఎస్యూవీ డిజైన్‌తో పాటు ఫీచర్ రిచ్ ప్యాకేజీని కలిగి ఉంది. ప్యూర్ ప్లస్ ఎస్ ట్రిమ్ లెవల్. ఇది బేస్ వేరియంట్ నుంచి మూడో కారుగా ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.11.87 లక్షలుగా ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చే ఈ కారు అమ్మకాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో,, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 17.78 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఫుల్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఫోర్ స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ కారు ప్రత్యేకతలుగా ఉన్నాయి.