
ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్ జురేల్, సంజుశాంసన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుభమ్ దూబే, హిట్ మేయర్ చివరి వరకూ ప్రయత్నించారు.
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. షమి వేసిన తొలి ఓవర్‌లో 16 పరుగులు సాధించింది. సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి జైశ్వాల్ (1) వెనుదిరిగాడు. కెప్టెన్ రియాన్‌పరాగ్ (4) కూడా సిమర్‌జీత్ సింగ్ చేతిలో ఔట్ అయ్యాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు సిమర్‌జీత్. మహమ్మద్ షమీ చేతి బౌలింగ్‌లో నితీశ్ రాణా (11) పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం ధ్రువ్ జురేల్, సంజుశాంసన్ మంచి భాగస్వామ్యం కొనసాగించారు. రాజస్థాన్ రాయల్స్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. హర్షల్‌పటేల్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ (66) పెవిలియన్ బాటపట్టాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ధ్రువ్ జురేల్ (70) ఔట్ అయ్యాడు. శుభమ్ దూబే (34), హిట్ మేయర్ (42) అద్భుతంగా రాణించిన ఫలితం లేకుండా పోయింది.
READ MORE: Ajay Ghosh : ఇండియాలో ఆ పార్టీలన్నీ ఏకం కావాలి : నటుడు అజయ్ ఘోష్
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో..
హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (67), ఇషాన్ కిషన్ (106) విధ్వంసం సృష్టించారు. హెడ్ 21 బంతుల్లో అర్ధ శతకం అందుకోగా.. ఇషాన్ 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (34), నితీశ్ కుమార్ రెడ్డి (30), అభిషేక్ శర్మ (24) కూడా క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 3, మహీశ్ తీక్షణ 2, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి
మరోవైపు.. సిమర్జీత్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ(1), ఆడమ్ జంపా(1), హర్షల్ పటేల్ (2) చొప్పున వికెట్లు తీశారు. కాగా.. ఈ మ్యాచ్ కొత్త రికార్డు నమోదైంది. సన్‌రైజర్స్ చేసిన 286 పరుగులు ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు కూడా ఎస్‌ఆర్‌హెచ్‌దే. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆ జట్టు మూడు వికెట్లకు 287 పరుగులు చేసింది. మరోసారి తన రికార్డును తీనే బద్దలు గొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్..
READ MORE: Botsa Satyanarayana: విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రంగంలోకి మాజీ మంత్రి