sunita williams receives one of the best homecoming ever by pet canine

Written by RAJU

Published on:

  • సునీతా విలియమ్స్ తాజా దృశ్యాలు వైరల్
  • స్పందించిన టెస్లా అధినేత ఎలోన్ మస్క్
sunita williams receives one of the best homecoming ever by pet canine

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సాధారణ స్థితికి వచ్చేశారు. ఇందుకు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలే నిదర్శనం. పెంపుడు కుక్కలతో జాలిగా గడిపారు. కుక్కలు కూడా చాలా సందడిగా.. ఆనందంగా కనిపించాయి. చాలా రోజులవ్వడంతో మీద.. మీద పడి ముద్దులు పెట్టాయి.

ఇది కూడా చదవండి: Amit Shah: వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై అమిత్ షా స్పష్టత

వారం రోజుల పర్యటన కోసమని సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ సాంకేతిక లోపం కారణంగా దాదాపు 9 తొమ్మిది నెలలు స్పేస్‌లోనే ఉండి పోవల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల ఆమె పుడిమిని ముద్దాడారు. అయితే కొద్ది రోజులు నాసా సెంటర్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉండిపోయారు. ప్రస్తుతం నెమ్మది.. నెమ్మదిగా నార్మల్ స్థితికి వచ్చేశారు. అంతరిక్షంలో నడక మరిచిపోయిన ఆమె.. ఇప్పుడు చక్కగా నడిచేస్తున్నారు. ఇక ఇంటికి రాగానే రెండు పెంపుడు కుక్కలు స్వాగతం పలికాయి. సునీతాను చూడగానే మీద పడిపోయి.. ముద్దులు పెట్టేసుకున్నాయి. ఇక సునీతా కూడా చాలా సేపు వాటితో ఆడుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై ఎలోన్ మస్క్ స్పందించారు. ఇప్పుడు అసలైన అత్యుత్తమ హోమ్ కమింగ్ అందుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు హార్ట్ ఎమోజీని పెట్టారు.

ఇది కూడా చదవండి: RCB vs GT: జోరుమీదున్న బెంగళూరును గుజరాత్ కట్టడి చేస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న గుజరాత్

మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ ద్వారా ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ అయ్యారు. దాదాపు 9 తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీద ల్యాండ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా ఆమెను అభినందించారు.

 

Subscribe for notification
Verified by MonsterInsights