Sunita Williams Face Painful Return: Baby Feet, Bone Density Loss

Written by RAJU

Published on:

  • సునీతా విలియమ్స్‌కి ఆరోగ్య సమస్యలు..
  • సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంతో ఇబ్బందులు..
  • బేబీ ఫుట్, ఎముకల సాంద్రత నష్టం..
  • భూమిపైకి వచ్చిన కొన్ని నెలల పాటు తీవ్రమైన బాధ..
Sunita Williams Face Painful Return: Baby Feet, Bone Density Loss

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గత 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు అంతా సిద్ధమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌కి చెందిన క్రూ-10 ఐఎస్ఎస్‌ని చేరుకుంది. శుక్రవారం ఫ్లోరిడా నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ -9 రాకెట్ ద్వారా క్రూ-10 అంతరిక్షంలోకి వెళ్లింది. రిటర్న్ జర్మీలో సునీతా విలియమ్స్ భూమికి పైకి వస్తుంది.

అయితే, సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడపడం వల్ల సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారు భూమి పైకి రావడం అత్యంత బాధతో కూడుకున్నది. వీరిద్దరికి ‘‘బేబీ ఫుట్’’ అని పిలిచే ఆరోగ్య పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. వ్యోమగామలు నెలల తరబడి అంతరిక్షంలో ఉండటంతో వారి పాదాలు శిశువుల పాదాల వలే మృదువుగా మారుతాయి. అంటే వారు నడవడానికి తీవ్రమైన బాధను అనుభవిస్తారు.

భూమిపై నడుస్తున్నప్పుడు మన పాదాల చర్మం గురుత్వాకర్షణ, ఘర్షణ కారణంగా మందంగా తయారవుతుంది. ఇది మనం నడిచేటప్పుడు చాలా నిరోధకతను తట్టుకుంటుంది. నొప్పి, అసౌకర్యం నుంచి రక్షిస్తుంది. నెలల తరబడి అంతరిక్షంలో ఉన్నవారు గట్టిపడిన చర్మం కోల్పోతారు. పాదాలు చాలా మృదువుగా తయారవుతాయి. మళ్లీ పాదాలు నార్మల్ స్థితికి వచ్చే వరకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Read Also: Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..

మరోవైపు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఎములక సాంద్రత కూడా గణనీయంగా తగ్గుతుంది. నాసా ప్రకారం, అంతరిక్షంలో సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రతీ నెల వ్యోమగాములు ఒక శాతం డెన్‌సిటీని కోల్పోతారు. కండరాలు కూడా బలహీనపడుతాయి. ఫలితంగా భూమిపైకి వచ్చిన కొన్ని రోజుల వరకు వారు సాధారణంగా నడవలేరు. దీనికి అనేక నెలల శిక్షణ అవసరం అవుతుంది.

ఇవే కాకుండా వ్యోమగాముల రక్త పరిమాణం కూడా తగ్గిపోతుంది. గుండె గురుత్వాకర్షణ లేని కారణంగా రక్తాన్ని పెద్దగా కష్టపడి పంప్ చేయాల్సిన పని ఉండదు. శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిస్తుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టవచ్చు.

అంతరిక్షంలో గడపడం వల్ల అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్‌కు గురికావడం జరుగుతుంది. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం మానవులను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది. అయితే, అంతరిక్షంలో ఉండే వారికి ఈ వెసులుబాటు ఉండదు. వ్యోమగాములు ప్రధానంగా మూడు రకాల రేడియేషన్‌కు గురవుతారని నాసా పేర్కొంది. వీటిలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు, సూర్యుని నుండి వచ్చే సౌర అయస్కాంత కణాలు, గెలాక్సీ కాస్మిక్ కిరణాలు ఉన్నాయి.

Subscribe for notification