గతేడాది జూన్ 5న కేవలం 8 రోజుల మిషన్ కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. వ్యోమనౌకలో చెడిపోవడంతో దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత స్పేస్ ఎక్స్‌తో కలిసి నాసా ఈ రోజు(బుధవారం, మార్చ్ 19) ఉదయం వారిద్దరిని భూమిపైకి తీసుకొచ్చింది. యావత్ ప్రపంచం విలియమ్స్, విల్మోర్ రాకకోసం ఎంత ఉత్కంఠగా ఎదురుచూసింది. వారు సురక్షితంగా భూమిపై కాలు మోపారని తెలియడంతో అంతా సంతోషించారు. అయితే సునీతా విలియమ్స్‌కు ఇది మూడో అంతరిక్ష ప్రయాణం. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతంలో కూడా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచ మొత్తం గర్వించదగ్గ ముద్దుబిడ్డ సునీతా విలియమ్స్ స్పేస్ ప్రయాణం, స్పేస్ వాక్‌లతో అనేక రికార్డులు నెలకొల్పారు. సునీతా, విల్మోర్ కలిసి రోదసీలో 286 రోజులు పరిశోధనలు చేపట్టారు. వీరిద్దరూ కలిసి 12 కోట్ల 13 లక్షల 47,491 మైళ్లు ప్రయాణించినట్లు నాసా తెలిపింది. అంటే దాదాపు 20 కోట్ల కిలోమీటర్లు. అలాగే వీరిద్దరూ భూమి చుట్టూ ఏకంగా 4,576 సార్లు తిరిగారు. ఈ మిషన్‌లో భాగంగా సునీతా రెండుసార్లు స్పేస్‌వాక్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బయట 62 గంటల 6 నిమిషాలు స్పేస్‌వాక్ చేసి సునీతా అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఒక మహిళా వ్యోమగామి ఇన్ని గంటలు స్పేస్ వాక్ చేయడం మరో రికార్డు.
స్పేస్‌వాక్‌లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ గ్రూప్ ఏంటెన్నా తొలగించారు. అంతేకాదు, స్పేస్ స్టేషన్ బయట ఉపరితలం నుంచి శాంపిల్స్ కూడా సేకరించారు. ఇప్పటి వరకు మూడు సార్లు స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన సునీతా విలియమ్స్.. మొత్తంగా 608 రోజుల పాటు స్పేస్‌లో ఉన్నారు. అంటే, ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి, శాస్త్రపరిశోధనల కోసం సునీతా విలియమ్స్ వెచ్చించిన ఈ సమయం ఎంతో మంది ప్రేరణాత్మకంగా నిలుస్తోంది. చాలా మంది ఆకాశంలో దేవతలు ఉంటారని అంటారు. కానీ, వాళ్లు నిజంగా ఉంటారా లేదో కానీ.. ఆకాశంలో నిజం ఉండి, నడిచిన దేవత మాత్రం మన సునీతా విలియమ్స్. ప్రాణాలను పణంగా పెట్టి, పరిశోధనల్లో భాగమై, భవిష్యత్తు తరాలకు బాటలు వేసిన సునీతమ్మను ఎంత మెచ్చుకున్నా తక్కువే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.