Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడిన సునీతా విలియమ్స్

Written by RAJU

Published on:

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడిన సునీతా విలియమ్స్

Sunita Williams: సునీతా విలియమ్స్ , బుచ్ విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడారు. 2024 జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా, విల్ మోర్ తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకు రానున్నారు.

స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో వీరు భూమి మీదకు బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం మార్చి 18న ఉదయం 8.15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ ముగిసింది. ఇది పూర్తైన తర్వాత ఉదయం 10.15 గంటలకు అన్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది.

క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు సునీతా విలియమ్స్, విల్ మోర్ ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగుతారు.

బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, విల్ మోర్ జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. విమానాల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినట్టుగానే అంతరిక్ష కేంద్రానికి వ్యోమనౌకలో వెళ్లే ప్రయోగంలో భాగంగా ఈ ఇద్దరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

స్లార్ లైనర్ లో టెక్నికల్ సమస్య తలెత్తడంతో సునీతా విలియమ్స్, విల్ మోర్ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకున్నారు. వీరిద్దరిని అంతరిక్ష కేంద్రానికి మోసుకెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌక 2024 సెప్టెంబర్ లో భూమి మీదకు తిరిగి వచ్చింది. సునీతా విలియమ్స్, విల్ మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు క్రూ 10 మిషన్ లో భాగంగా భూమి మీదకు రానున్నారు.

Subscribe for notification