Summer Tips: వేసవి వేడి, చెమట నుంచి ఉపశమనం కోసం.. ఏ రంగు బట్టలు ఉత్తమం అంటే..

Written by RAJU

Published on:

Summer Tips: వేసవి వేడి, చెమట నుంచి ఉపశమనం కోసం.. ఏ రంగు బట్టలు ఉత్తమం అంటే..

మండే వేసవిలో భానుడు భగభగ మంటూ మండుతూ ఉంటాడు. తీవ్రమైన ఎండ వేడికి చెమటలు పట్టడం సహజం. దుస్తుల ఎంపికలో స్వల్ప తేడా వచ్చినా సరే శరీరమంతా మంటగా అనిపిస్తుంది. చికాకుగా అనిపించవచ్చును కూడా. అయితే ఈ సీజన్‌లో శరీరానికి సరిపోయే దుస్తులు ధరించడం ముఖ్యం. కాటన్, లెనిన్ వంటి తేలికైన, మృదువైన మెత్తని బట్టలు సౌకర్యవంతంగా ఉంటాయి. బట్టల ఎంపికతో పాటు, రంగులపై కూడా చాలా శ్రద్ధ వహించాలి. కనుక వేసవిలో ఎండ వేడి నుంచి నుంచి ఉపశమనం కోసం కొన్ని రంగుల దుస్తులు ధరించడం సముచితం. ఆ రంగుల దుస్తులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

తెలుపు: తెల్లని దుస్తులు అందరికీ సరిపోతాయి. ఈ రంగు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రంగు దుస్తులు శరీరానికి, మనసుకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తాయి. అందువల్ల వేసవిలో ఎక్కువగా తెల్లటి టీ-షర్టులు, సల్వార్లు, కుర్తీలు వంటి సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది.

గోధుమ రంగు: చాలా మందికి గోధుమ రంగు అంటే అంతగా తెలియదు. అయితే గోల్డ్ రంగులో సింపుల్ డిజైన్ ఉన్న దుస్తులు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ రంగు ఒక ఫ్యాషన్ రంగు. వేసవి కాలంలో ఈ రంగు ధరించడం వల్ల ఎవరైనా సరే మరింత అందంగా కనిపిస్తారు.

పసుపు: వేసవిలో సూర్యకాంతి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కనుక ధరించే దుస్తుల రంగు ఎంపిక కూడా చాలా ముఖ్యమైనది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ సీజన్‌లో ఈ పసుపు పూల డిజైన్ డ్రెస్, కుర్తా, సల్వార్ సూట్ ధరించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

పింక్: అమ్మాయిలకు పింక్ రంగు దుస్తులు అంటే ఇష్టం. లేత గులాబీ రంగు ఆహ్లాదకరమైన, అందమైన అనుభూతిని ఇస్తుంది. కనుక మండే ఎండలో గులాబీ రంగు లెహంగాలు, కుర్తీలు, సల్వార్లు ధరించడం ఉత్తమం. ఈ రంగు ఫ్యాషన్ కలర్ అని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

లేత నీలం: లేత నీలం సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ రంగు రిఫ్రెషింగ్, ప్రశాంతత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక రంగు దుస్తులు కూడా వేసవిలోని వేడి నుంచి ఉపశమనం కోసం ఉత్తమ ఎంపిక.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Subscribe for notification