Summer time Headache: ఎండవేడికి తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ పాటిస్తే వెంటనే రిలీఫ్..

Written by RAJU

Published on:

Summer Headache Home Remedies: వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక వేసవిలో భగభగ మండే ఎండలకు తలనొప్పి రావడం సర్వసాధారణం. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం తేమను కోల్పోయి నీటి కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా తలనొప్పి వస్తుంది. అదే వేసవిలో తలనొప్పి ఇందువల్ల కూడా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నొప్పి నుంచి తక్షణమ ఉపశమనం పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలను సూచిస్తున్నారు. వివరిస్తున్నారు.

వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తలనొప్పి సమస్యను తగ్గించవచ్చు. ఈ సమయంలో ఇలా జరగడం సర్వసాధారణం కాబట్టి భయపడాల్సిన పనిలేదు. కానీ, దాహం వేసినా వేయకున్నా ఎప్పటికప్పుడు తగినం నీరు తాగుతూనే ఉండాలి. అప్పుడే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండగలరు. శరీరంలో నీటి కొరతను నివారించడానికి ప్రతిరోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఇంకా తలనొప్పి వచ్చినపుడు ఈ 3 ఇంటి నివారణలు ప్రయత్నించండి.

నువ్వుల నూనె

శరీర వేడిని తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నువ్వుల నూనెతో తలపై సున్నితంగా మసాజ్ చేసుకుంటే శరీరం ప్రశాంతంగా మారుతుంది. దీనివల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

సూర్యరశ్మి

ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల తలనొప్పి సమస్య పెరుగుతుంది. అందుకే బయటికి వెళ్లినపుడు సూర్యకిరణాలు నేరుగా మీ తలని తాకుండా చూసుకోవాలి. అప్పుడే తలనొప్పి రాకుండా నిరోధించవచ్చు. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్లడం లేదా తలపై స్కార్ఫ్ లేదా టోపీ ధరించడం మంచిది. ఈ జాగ్రత్తలు తలనొప్పిని నివారించడంలో సహాయపడతాయి.

తులసి, అల్లం

తులసి, అల్లంతో తయారుచేసిన టీ కూడా వేడి వల్ల కలిగే తలనొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. ఈ టీ తాగడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే ఇది సహజమైనది. శరీరానికి ఎటువంటి హాని కలిగించకుండా విశ్రాంతినిస్తుంది. వేడి వల్ల కలిగే సమస్యలకు ఇది సహజమైన ఇంటి నివారణగా బాగా పనిచేస్తుంది.

మజ్జిగ

మజ్జిగ తాగడం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది. వేసవిలో చల్లని మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా దాహం కూడా తీరుతుంది. ఇది శరీరంలో నీటి పరిమాణాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మజ్జిగ తాగడం వల్ల తలనొప్పి, అలసట కూడా తగ్గుతాయి.

హైడ్రేటెడ్ గా ఉండండి

రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. నిర్జలీకరణం, నిద్రా భంగం నివారించడానికి ఆల్కహాల్, కెఫిన్ పరిమితంగా తీసుకోండి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. దీనితో పాటు అలసట, బద్ధకం కూడా సంభవిస్తాయి.

ఒకే దినచర్య పాటించండి

తలనొప్పి రాకుండా ఉండటానికి భోజనం, నీరు తీసుకోవడం, వ్యాయామం, సరైన నిద్ర కోసం ఒక క్రమమైన షెడ్యూల్‌ను వేసుకోండి. ఆ ప్రకారమే దినచర్యలో అమలు చేసుకోండి. అప్పుడు తలనొప్పితో పాటు అనేక ఇతర వ్యాధులను నివారించవచ్చు.

Read Also: Brown Rice or White Rice: బ్రౌన్ రైస్ లేదా వైట్ రైస్.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..

Health Tips: ఉదయం నిద్ర లేవగానే ఇలా చేస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది..

Sleeping Tips: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తే హాయిగా నిద్రపోతారు..

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights