– ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్ సిటీ: భానుడి భగ.. భగలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గత రెండు రోజు లుగా నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదు కాగా, బుధవారం మలక్‌పేట ముసారాం బాగ్, బోయిన్‌పల్లి, ఉప్పల్(Boynpally, Uppal) ప్రాంతాల్లో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మియాపూర్, అత్తాపూర్, నాచారం, వినాయకనగర్, బాలాజీనగర్ ప్రాంతాల్లో 42 డిగ్రీలు… అంబర్‌పేట, మెహిదీపట్నం, ముషీరాబాద్, న్యూమెట్టుగూడ(Musheerabad, New Mettuguda) ప్రాంతాల్లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వార్తను కూడా చదవండి: MP Kavya: ఆ పనులు వేగంగా పూర్తిచేయాలి

మధ్యాహ్నం వడగాలులు వీచడంతో ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్య సగానికిపై తగ్గిపోయింది. ఉదయం 9 గంటల నుంచే ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఏప్రిల్ 30 నాటికి ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరిగే అవకాశముంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 27.2 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో వేడిగాలుల ప్రభావం రాత్రిళ్లు కొనసాగుతుంది. కాగా, గతేడాది ఏప్రిల్ 23న గ్రేటర్ లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
బిర్యాని.. బీ కేర్‌ఫుల్..
చంచల్‌గూడ జైలుకు అఘోరీ
ఫినాయిల్, సబ్బుల పైసలు నొక్కేశారు
ఫస్ట్ టైం తెలుగులో…
Read Latest Telangana News and National News