How to Remove Sun Tan Fast: వేసవిలో అందరూ ఎదుర్కొనే సర్వసాధారణమైన సమస్యలలో ఒకటి స్కిన్ టానింగ్. ఈ కాలంలో ఎండలో కొంత సమయం గడిపినా ముందుగా ప్రభావితమయ్యేది చర్మమే. మరీ ముఖ్యంగా శరీరంలో ఏ భాగలనైతే నేరుగా సూర్యరశ్మి తాకుతుందో ముందుగా ఆ ప్రాంతాలు ఎర్రగా కందిపోతాయి. తర్వాత నల్లగా మారుతుంది. దీన్నే సన్ ట్యానింగ్ అంటారు. కాబట్టి, ఎండాకాలంలో శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాకే ఇంటి నుంచి బయటకు వెళ్లడం మంచిది. ఇక సన్ టాన్ పోయేందుకుమార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్ల సన్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. వీటిని అప్లై చేసిన తర్వాత కూడా ట్యానింగ్ సమస్య రాదనే గ్యారెంటీ లేదు. కాస్తయినా నల్లటి పొర ముఖంపై కనిపిస్తుంది. కానీ, ఈ సమస్యను వెంటనే పరిష్కరించడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.
సన్ ట్యానింగ్ తొలగించేందకు ఈ 5 చిట్కాలు :
1) పండ్లు
పండ్ల ద్వారా సన్ ట్యానింగ్‌ను సులభంగా తొలగించవచ్చు. బొప్పాయిని ఉపయోగించి స్కిన్ టానింగ్ ను క్లియర్ చేసుకోవచ్చు. ఈ పండు చర్మాన్ని శుభ్రపరిచి మెరిసేలా చేస్తుంది. సన్‌టాన్‌ను తొలగించడానికి చాలా మంచిది. బొప్పాయితో స్కిన్ ట్యాన్ పోవాలంటే ముందుగా మీరుపండిన బొప్పాయి ముక్కలను మెత్తగా రుబ్బి పేస్ట్ లా చేయండి. తరువాత ఒక టీస్పూన్ తేనె, రెండు టీస్పూన్ల చల్లని పాలతో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, భుజాలు, చేతులకు అప్లై చేయండి. తేనె, పాలు కలపడం వల్ల టాన్ తక్షణమే తొలగిపోతుంది.
2) దోసకాయ
మీ ముఖంపై ఏర్పడ్డ టానింగ్‌ను దోసకాయ ఉపయోగించి వెంటన తొలగించవచ్చు. సన్ టాన్ తొలగించడానికి ఉత్తమమైన, సహజ నివారణలలో ఇదొకటి. ముందుగా మీరు దోసకాయ తొక్క తీసి తురుముకోవాలి. తరువాత దాని రసాన్ని పిండండి. ఆ రసాన్ని కాటన్ బాల్ లేదా వేళ్లతో ముఖంపై అప్లై చేయండి కాసేపు ఆరనిచ్చి కడిగేసుకోండి.
3) ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖం నుంచి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. ఒక గిన్నెలో రెండు చెంచాల ముల్తానీ మిట్టి, నాలుగు చెంచాల కలబంద జెల్ కలిపి మందపాటి పేస్ట్ తయారుచేసిన తర్వాత బ్రష్‌తో చర్మంపై అప్లై చేయండి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
4) తేనె, నిమ్మకాయ
మీరు టానింగ్‌ను తక్షణమే తొలగించే మార్గం కోసం వెతుకుంతుంటే తేనె, నిమ్మకాయను ఉపయోగించండి. తేనె ఒక సహజ మాయిశ్చరైజర్. నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి వాడినప్పుడు చర్మం తళ తళా మెరిసిపోవడం ఖాయం. తేనె, నిమ్మరసం కలిపిన ప్యాక్‌ను ముఖంపై లేదా టాన్ అయిన శరీర భాగాలపై అప్లై చేయండి. చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి మీరు ఈ మిశ్రమానికి కాస్త చక్కెరను కూడా జోడించవచ్చు. దీన్ని చర్మంపై కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచి ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.
5) బంగాళాదుంపలు
బంగాళాదుంపల చర్మాన్ని సహజంగా సంరక్షించే అద్భుతమైన కూరగాయ. ఇవి త్వరగా టాన్ తొలగిపోయేలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటి ద్వారా ఎలా ట్యాన్ పోగొట్టుకోవాలంటే, మొదట బంగాళాదుంపలను తొక్క తీసి తురుముకోవాలి. తరువాత బంగాళాదుంపను పిండి దాని రసాన్ని శుభ్రమైన కప్పులో సేకరించండి. ఆ రసాన్ని చర్మంపై రాసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో బాగా కడగాలి. ట్యాన్ తగ్గిపోయి స్కిన్ మిల మిలా మెరిసిపోతుంది.
Read Also: Dust Cleaning Tips: క్లీన్ చేసిన తర్వాతా వస్తువులపై దుమ్ము కనిపిస్తోందా.. ఈ ట్రిక్‌తో..
Garlic Benefits: వెల్లుల్లి తొక్క తీసి వాడాలా.. తీయకుండా వాడాలా..
Black Vs Red Clay Pot: నల్ల కుండ Vs ఎరుపు కుండ.. ఏ కుండలో నీళ్లు మంచివి..