
ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణలు. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి వాకింగ్ ఎంతగానో సాయపడుతుందని చెబుతున్నారు. ఎవరైనా సరే సులభంగా చేసే ఈ వ్యాయామంతో ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కానీ, చాలా మందికి మార్నింగ్ వాకింగ్ లేదా సాయంత్రపు నడక బెటరా? ఎప్పుడు వాకింగ్ చేస్తే మంచిది అనే సందేహం వస్తుంది. కానీ, ప్రతి రోజూ మార్నింగ్ వాకింగ్ చేయడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మార్నింగ్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మార్నింగ్ వాక్ రక్త ప్రసరణను మెరుగుపరిచి.. అధిక రక్తపోటును తగ్గిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇంకా ఎక్కువ శారీరక శ్రమ లేకుండానే గుండె కండరాలను బలోపేతం చేస్తుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే నడవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని వివరిస్తున్నారు. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 30 నిమిషాలు నడిస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుంది. అలాగే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుందని అంటున్నారు.
మార్నింగ్ వాక్ చేయటం వల్ల బీపి కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు గుండెజబ్బులు, స్ట్రోక్స్ వంటి సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు అంటున్నారు. వాకింగ్‌తో బాడీలో కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో పాటు బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉదయాన్నే నడిస్తే శక్తి పెరుగుతుంది. బాడీతో పాటు మైండ్ రీఫ్రెష్ అవుతుంది. యాక్టివ్‌గా ఉంటారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..