Belly Fat Reduction Techniques: నడుము, పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు ఎవరికైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది. మిగతా శరీర భాగాలతో పోల్చితే బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం అంత ఈజీ కాదని చాలా మంది ఫీలింగ్. కానీ, జపాన్ వాళ్లకయితే ఇది పెద్ద సమస్యే కాదు. ఎందుకంటే, సాంప్రదాయం పేరుతో వారు అనుసరించే ఈ వాటరీ థెరపీ వల్ల వారికి అధిక పొట్ట సమస్య ఎప్పటికీ రాదు. అలాగని ఈ నీరేం మంత్ర జలం కాదు. ఈ పానీయాన్ని తీసుకునే విధానం వల్లే ఏళ్లు గడుస్తున్నా అందంగా, నాజూగ్గా ఉండగలుగుతున్నారు.
జపనీస్ వాటర్ థెరపీ అంటే ఏమిటి?
జపాన్ వాళ్లు అనాది కాలం నుంచి పాటిస్తున్న ఈ పాత బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే దీనిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఆహారం త్వరగా, సరిగ్గా జీర్ణమవుతుంది. కొవ్వు పేరుకుపోదు. ఎటువంటి దుష్ప్రభావాలు రానీయకుండా బొడ్డు, వీపు కొవ్వును శాశ్వతంగా పోగొడుతుంది.
ఈ నీటిని ఎప్పుడు, ఎలా త్రాగాలి?
జపనీస్ నీటిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకుంటేనే దాని ప్రభావం కనిపిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమ మార్గం. ఇది రాత్రిపూట నెమ్మదించిన జీవక్రియను సక్రియం చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. శరీరం నీటిని సరిగ్గా గ్రహించేలా మీరు ఒక చోట ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా కొంచెం కొంచెం సిప్ చేస్తూ హాయిగా త్రాగాలి . కావలిస్తే మీరు రోజుకు రెండుసార్లు అయినా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. కానీ ఎల్లప్పుడూ తినడానికి ముందే తాగాలి.
జపనీస్ వాటర్ తయారీ విధానం
వేడి నీటిలో ముందుగా తొక్క తీసిన శుభ్రంచేసిన అల్లం వేసి మొత్తబడే వరకూ మరిగించండి. తర్వాత గోరువెచ్చగా మారేంతవరకూ చల్లార్చి సగం నిమ్మకాయ, కొన్ని దోసకాయ ముక్కలు పుదీనా ఆకులు, జోడించి 5 నిమిషాలు మరిగిస్తే జపనీస్ వాటర్ రెడీ. ఈ పానీయాన్ని గోరువెచ్చగా అయ్యాకే తాగాలి. ఇందులో ఉండే నిమ్మకాయ శరీరానికి ఆల్కలీన్ ఇస్తే. దోసకాయ చల్లబరుస్తుంది. పుదీనా కడుపుకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ పానీయంలోని పదార్థాలన్నీ కలిసి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. కొవ్వును త్వరగా కరిగించేందుకు సాయపడతాయి. వేసవికి ఈ పానీయం సరైనది.
దుష్ప్రభావాలు ఉన్నాయా?
ఈ పానీయం సహజ పదార్ధాలతో తయారు చేసినప్పటికీ కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. దీన్ని ఎక్కువ పరిమాణంలో తాగడం లేదా వేడి చేయకుండా తీసుకోవడం వల్ల కొంతమందిలో గ్యాస్ లేదా అసిడిటీ ఏర్పడవచ్చు. అప్పటికే ఏవైనా తీవ్రమైన కడుపు సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఒకసారి వైద్యుడిని సంప్రదించండి. తగినంత మోతాదులో ఈ నీరు తీసుకుంటే పూర్తిగా సురక్షితం. శరీరానికి ఏ హాని కలిగించదు.
ఎన్ని రోజుల తర్వాత ప్రభావాలు కనిపిస్తాయి?
మీరు దీన్ని క్రమం తప్పకుండా తాగితే 7 నుండి 10 రోజుల్లో మీరు స్వల్ప ప్రభావాలను చూడటం ప్రారంభించవచ్చు, కడుపులో ఉబ్బరం తగ్గి తేలికైన అనుభూతి కలగడం, శక్తిస్థాయి పెరిగి ఎనర్జిటిక్ గా కనిపించడం వంటివి. కానీ, మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి నిద్ర పొందాలి. అప్పుడు 2-3 వారాలలో బరువులో మార్పులను గమనించవచ్చు. ఇది త్వరిత పరిష్కారం కాదు. కానీ ఆరోగ్యకరమైన మార్గంలో నెమ్మదిగా, శాశ్వతంగా బెల్లీ ఫ్యాట్, బరువు సమస్య పోగొడుతుంది .
Read Also: Lemon Grass Tea: బీపీ, షుగర్ ఉన్నవాళ్లు లెమన్ గ్రాస్ టీ తాగవచ్చా..
Ice Water: వేసవిలో ఐస్ వాటర్ తెగ తాగేస్తున్నారా.. ఈ
Cold and Cough in Summer: ఎండాకాలంలోనూ జలుబుతో ఇబ్బందులు.. వైద్యులు చెప్పేదేంటంటే..