SSC GD Constable Result 2025 Date : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ రిజల్ట్ వెల్లడికి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదలైన విషయం తెలిసిందే.

ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరిగిన విషయం తెలిసిందే. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 160 మార్కులకు (80 ప్రశ్నలు.. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) నిర్వహించారు. ఈ పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఈ పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ వంటి 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించారు. తాత్కాలిక ఆన్సర్ కీ మార్చి 4వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే.
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు) మరియు SSFలలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మన్ (GD), మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి వంటి 39,481 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నియామక డ్రైవ్ జరుగుతోంది. అయితే.. అభ్యర్థులు ఈ పరీక్ష ఫలితాలు, తర్వాతి ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఇక.. ఈ SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) SSF లలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి ఉద్యోగాలు ఇలా మొత్తం 39,481 భర్తీ కోసం ఈ నియామక డ్రైవ్ జరుగుతోంది. అలాగే.. నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ప్రమాణాల పరీక్ష (PST), వైద్య పరీక్ష/ సర్టిఫికెట్ ధృవీకరణ ఉంటాయి. ఈ కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించారు.
విభాగాల వారీగా ఖాళీలివే :
- బీఎస్‌ఎఫ్ – 15,654
- సీఐఎస్‌ఎఫ్ – 7145
- సీఆర్‌పీఎఫ్ – 11,541
- ఎస్‌ఎస్‌బీ – 819
- ఐటీబీపీ – 3017
- ఏఆర్ – 1248
- ఎస్‌ఎస్‌ఎఫ్ – 35
- ఎన్‌సీబీ – 22