SSC GD Constable 2025 Answer Key : ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ 2025 విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే..
హైలైట్:
ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ 2025
ఫిబ్రవరిలో ముగిసిన రాత పరీక్షలు
ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల
Samayam Teluguఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ ఆన్సర్ కీ 2025SSC GD Constable Answer Key 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 25 వరకు కానిస్టేబుల్ (GD) పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆన్‌లైన్ రాత పరీక్షలను ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించారు. ఈ SSC GD కానిస్టేబుల్ ఆన్సర్ కీ 2025 తాజాగా అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు.. SSC రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నాపత్రాలను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా.. అభ్యర్థులకు ఆన్సర్ కీని సవాలు చేసే అవకాశం కూడా కల్పించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ లాగిన్ ID, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ కావొచ్చు. అభ్యర్థులు తాత్కాలిక జవాబు కీపై అభ్యంతరాలను సమర్పించాలనుకునే అభ్యర్థులు మార్చి 4 (సాయంత్రం 6) నుంచి మార్చి 9 (సాయంత్రం 6) వరకు ఆన్‌లైన్ విధానంలో తెలియజేయవచ్చు. అయితే అభ్యంతరాలను తెలియజేయడానికి ప్రతి ప్రశ్నకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 9న సాయంత్రం 6 గంటల తర్వాత అందే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని SSC స్పష్టం చేసింది.
అభ్యర్థులు తమ అభ్యంతర పత్రాల ప్రింటవుట్‌ను సమాధాన కీలతో సహా తీసుకోవాలని కమిషన్ కోరింది.. ఎందుకంటే నిర్దిష్ట సమయం తర్వాత అందుబాటులో ఉండవు. ఇక.. ఈ SSC GD నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) SSF లలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి ఉద్యోగాలు ఇలా మొత్తం 39,481 భర్తీ కోసం ఈ నియామక డ్రైవ్ జరుగుతోంది. అలాగే.. నియామక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), తర్వాత శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ప్రమాణాల పరీక్ష (PST), వైద్య పరీక్ష/ సర్టిఫికెట్ ధృవీకరణ ఉంటాయి. ఈ కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించారు.
విభాగాల వారీగా ఖాళీలివే :
బీఎస్‌ఎఫ్ – 15,654
సీఐఎస్‌ఎఫ్ – 7145
సీఆర్‌పీఎఫ్ – 11,541
ఎస్‌ఎస్‌బీ – 819
ఐటీబీపీ – 3017
ఏఆర్ – 1248
ఎస్‌ఎస్‌ఎఫ్ – 35
ఎన్‌సీబీ – 22
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు.
రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు.
కిషోర్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.… ఇంకా చదవండి