SSC: గుడ్ న్యూస్ ఫలితాలు విడుదల.. 85 వేల మంది షార్ట్‌లిస్ట్

Written by RAJU

Published on:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2024-25 సబ్-ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, CAPF పరీక్షలు రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా దీనికి సంబంధించిన Physical Efficiency Test (PET)/Physical Standard Test (PST) ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను SSC అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాల వివరాలు

ఫలితాల ప్రకారం SSC CPO PET/PST 2024 రౌండ్‌లో 85,614 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్టు చేయబడ్డారు. వీరిలో 37,763 మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా, నలుగురు తాత్కాలికంగా అనర్హులుగా పరిగణించబడ్డారు. అదనంగా 21,661 మంది అభ్యర్థులు అర్హత ప్రమాణాలను అందుకోలేదు. ఈ క్రమంలో మొత్తం 24,190 మంది అభ్యర్థులు తదుపరి రౌండ్‌కి అర్హత సాధించారు. ఇప్పటి వరకు అర్హత సాధించిన అభ్యర్థులలో 1,954 మంది మహిళలు, 22,236 మంది పురుషులు ఉన్నారు. 59 మంది అభ్యర్థుల ఫలితాలు నిలిపివేయబడ్డాయి.

ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • SSC CPO PET/PST 2024-25 ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయడానికి మీరు ఈ క్రింది స్టెప్పులను అనుసరించండి

  • ముందుగా SSC అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.inకి వెళ్లండి

  • “SSC CPO PET/PST 2024-25 ఫలితం” అనే లింక్‌ని క్లిక్ చేయండి

  • ఆ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత, మీరు PDF ఫైల్‌లో ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్స్‌ను చూసేందుకు అందుబాటులో ఉంటుంది

  • ఆ PDFలో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి Ctrl+F నొక్కి మీ రోల్ నంబర్‌ను సెర్చ్ చేయండి

  • తనిఖీ చేసిన క్రమంలో మీ నంబర్ ఉంటే మీరు అర్హత సాధించారని అర్థం

  • ఆ క్రంమలో PDFని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తులో అవసరం కోసం సేవ్ చేసుకోండి

SSC CPO 2024-25 Paper 2 పరీక్ష తేదీ:

ఇక SSC CPO 2024-25 Paper 2 పరీక్ష 2025 మార్చి 8న నిర్వహించబడనుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను సమయానికి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులు సంబంధిత SSC కార్యాలయాల ద్వారా జారీ చేయబడతాయి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను SSC హెడ్ క్వార్టర్స్ లేదా SSC ప్రాంతీయ కార్యాలయాల వెబ్‌సైట్‌ల నుంచి పొందవచ్చు.

అభ్యర్థుల అర్హత..

PET/PST రౌండ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు, తదుపరి రౌండ్‌కి చేరుకున్నారు. ఈ రౌండ్‌లో 1,954 మంది మహిళలు, 22,236 మంది పురుషులు అర్హత సాధించారు. అనర్హత పొందిన అభ్యర్థులు అర్హత ప్రమాణాలు పాటించకపోవడంతో వారి అభ్యర్థిత్వం రద్దు చేయబడింది.

మరింత సమాచారం..

ఫలితాల తర్వాత అభ్యర్థులు తమ తదుపరి స్టేజీకి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పర్యవేక్షించాల్సి ఉంటుంది. SSC CPO PET/PST 2024 పరీక్షకు సంబంధించి అన్ని అప్డేట్స్ కోసం అభ్యర్థులు SSC అధికారిక వేదికలను వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

CBSE: టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షల హాల్ టికెట్స్ విడుదల.. కానీ నో డౌన్‌లోడ్ ఆప్షన్..


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Education News and Latest Telugu News

Updated Date – Feb 04 , 2025 | 12:21 PM

Subscribe for notification