Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Preview: ఐపీఎల్ (IPL) 2025 రెండవ వారానికి చేరుకుంది. మరోవైపు ఈ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠగా ముందుకు సాగుతున్నాయి. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు జరిగిన 14 మ్యాచ్‌లలో హోరాహోరీ పోరును ప్రేక్షకులు చూశారు. ఏప్రిల్ 3న ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరుగుతుంది. ఒకవైపు, హైదరాబాద్ తన మునుపటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత కోల్‌కతాకు చేరుకుంటోంది. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా 2 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. ఈ రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11, హెడ్ టూ హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం..
హెడ్ టు హెడ్ రికార్డ్స్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఎన్నిసార్లు తలపడ్డాయి, ఎవరు ఎన్నిసార్లు గెలిచారో ఇప్పుడు తెలుసుకుందాం.. రెండు జట్ల హెడ్ టు హెడ్ గణాంకాల గురించి మాట్లాడుకుంటే, కేకేఆర్ జట్టు చాలా ముందున్నట్లు కనిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇప్పటివరకు 28 మ్యాచ్‌లు ఆడగా, హైదరాబాద్ 9 మ్యాచ్‌లలో, కోల్‌కతా 19 మ్యాచ్‌లలో గెలిచింది. రెండు జట్ల మధ్య జరిగిన ఒక్క మ్యాచ్ కూడా ఫలితం లేకుండా జరగలేదు.
ఈ మ్యాచ్‌లలో రెండు జట్ల అత్యధిక స్కోర్‌లను పరిశీలిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు 228గా ఉంది. కోల్‌కతా అత్యధిక స్కోరు 208. ఈ మ్యాచ్‌లలో, కోల్‌కతాపై హైదరాబాద్ అత్యల్ప స్కోరు 113 పరుగులుగా ఉంది.
ఇవి కూడా చదవండి
పిచ్ నివేదిక..
ఇక పిచ్ రిపోర్ట్‌ని చూస్తే.. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఈడెన్ గార్డెన్స్ హోమ్ గ్రౌండ్. దాదాపు 68,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక క్రికెట్ స్టేడియాలలో ఒకటిగా నిలిచింది.
ఈడెన్ గార్డెన్స్ ఇప్పటివరకు 94 ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 38 సార్లు గెలిచింది. ఛేజింగ్ చేసిన జట్లు 56 సార్లు గెలిచాయి.
ఇక్కడ పిచ్ ఉపరితలం సాధారణంగా చదునుగా ఉంటుంది. బౌన్స్ బాగుంటుంది. ఇది స్ట్రోక్ ప్లేకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం బెంగళూరు లేదా హైదరాబాద్‌లోని పిచ్‌ల మాదిరిగా ఇది ఫ్లాట్‌గా లేదు. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్‌లో ఈ మైదానంలో ఎక్కువ పరుగులు రాకపోయినా, ఆటగాళ్ల బ్యాట్‌లపై బంతి బాగా వస్తోంది.
బౌలింగ్ కోణం నుంచి మాట్లాడితే.. ఈ పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. కానీ, బంతి పాతబడే కొద్దీ, స్పిన్నర్లకు సహాయం లభించడం ప్రారంభమవుతుంది. గత 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే, ఈ పిచ్‌పై పేసర్లు 57% వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్లు 43% వికెట్లు పడగొట్టారు.
వాతావరణ నివేదిక..
కోల్‌కతా వాతావరణం గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉందని తెలిసి అభిమానులు కొంచెం నిరాశ చెందవచ్చు.
వాతావరణ నివేదిక ప్రకారం, మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు వర్షం పడే అవకాశం 10 శాతం మాత్రమే ఉంది. కానీ, రాత్రి 11 గంటల ప్రాంతంలో అది 70 శాతానికి పెరుగుతుంది. అయితే, అప్పటికి మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాతావరణం కారణంగా ఈ మ్యాచ్ ఆగిపోతే, రెండు జట్లకు చెరొక పాయింట్ వస్తుంది.
SRH vs KKR మధ్య ఎవరిది పైచేయి?
ఇప్పుడు ఏ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం.. ఇందులో మొదటి అంశం హోమ్ గ్రౌండ్. ఎందుకంటే, ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్, కాబట్టి ఆ జట్టుకు ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది. SRH, KKR కంటే బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి బలమైన బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వీరు ఎప్పుడైనా ఏ మ్యాచ్‌నైనా మలుపు తిప్పగలరు. బౌలర్లలో, పాట్ కమ్మిన్స్, మహ్మద్ షమీ బలమైన పేసర్లు ఉన్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..