Sunrisers Hyderabad vs Gujarat Titans, 19th Match Live Score in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా 19వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ హోం గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది.
ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది ఐదవ మ్యాచ్ కాగా, గుజరాత్‌కు నాల్గవ మ్యాచ్ అవుతుంది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR)ను 44 పరుగుల తేడాతో ఓడించింది. అయితే, ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
మరోవైపు, గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చూస్తోంది. పంజాబ్ కింగ్స్ పై ఓటమితో తన ప్రచారాన్ని ప్రారంభించిన గుజరాత్.. తన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (MI) ను, మూడో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను ఓడించింది.