హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ సాయంత్రం మరో ఉత్కంఠభరిత ఐపీఎల్ మ్యాచ్‌కు వేదిక. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడుతోంది. ఇది సీజన్‌లో 19వ గ్రూప్-స్టేజ్ మ్యాచ్ కాగా, రెండు జట్లు మధ్య హై-వోల్జ్ పోటీకి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలుపులతో సుస్థిరంగా మూడో స్థానంలో కొనసాగుతుండగా, సన్‌రైజర్స్ మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే విజయం నమోదు చేసి అట్టడుగునకు చేరుకుంది. ఈ నేపథ్యంలో, రెండు జట్లు కీలక విజయాన్ని ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.
ఇక మ్యాచ్‌కు ముఖ్యమైన అంశం పిచ్ పరిస్థితులే. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ ఈ సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 25 వికెట్లు మాత్రమే పడడం చూస్తే, ఇది పూర్తిగా బ్యాటింగ్‌కు మద్దతిచ్చే ట్రాక్ అని చెప్పవచ్చు. ఐపీఎల్ 2025లో ఈ వేదికపై సగటు రన్‌రేట్ 11.96గా ఉండటం కూడా దీనికి నిదర్శనం. బౌలర్లకు ఈ పిచ్ సహకారం తక్కువగా ఉండటంతో పేసర్లు, స్పిన్నర్లు కనీసంగా ఆటలో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బ్యాటర్లు మాత్రం ఈ పోటీ వేగాన్ని, బౌన్స్‌ను సద్వినియోగం చేస్తూ సునాయాసంగా పరుగులు తీయగలుగుతారు. సాధారణంగా ఈ పిచ్ కాలక్రమేణా నెమ్మదించగా టాస్ గెలిచిన జట్టు సాధారణంగా ముందుగా బౌలింగ్ చేయడాన్నే ఎంచుకుంటుంది.
వాతావరణం విషయానికి వస్తే, అక్యూవెదర్ అంచనా ప్రకారం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత దాదాపు 37°C ఉండొచ్చని, నిజమైన అనుభూతి ఎక్కువగా 39°C వరకు చెబుతోంది. గాలి ఆగ్నేయ దిశగా గంటకు 11 నుండి 30 కి.మీ వేగంతో వెళుతుంది. వర్షం పడే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం 33 శాతం మేఘావృతం ఉండే అవకాశం, అవపాతం ఉండకపోవడం వల్ల మ్యాచ్ పూర్తిగా నిరంతరాయంగా సాగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో SRH-GT జట్ల మధ్య ఈరోజు జరగనున్న పోరు భారీ స్కోర్లు, విజ్ఞానంతో నిండిన స్ట్రాటజీలు, గట్టి పోటీకి వేదికగా నిలవనుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై టాస్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. అభిమానులు ఒక ఎక్సయిటింగ్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉండొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..