మెగా వేలంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా.. అది జట్టు ప్రయోజనం కోసమే ప్రయత్నిస్తారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ మాత్రం పెట్టిన డబ్బుకు లాభం అటుంచితే.. ఇప్పుడు ఆమె పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అది కూడా రూ.39.25 కోట్లు. కేవలం 3 ప్లేయర్స్ ఆమె వెచ్చించిన ఈ డబ్బు.. ఇప్పుడు నష్టాల బాట పట్టేలా ఉంది.
ముగ్గురు ఆటగాళ్లపై 39.25 కోట్లు..
గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ జట్టు ఫైనల్‌లో ఓడిపోయిన.. వారి అగ్రెసివ్ అప్రోచ్ అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో ప్రత్యర్థి జట్లలో భయాన్ని సృష్టించింది. దీంతో ఈ ఏడాది సన్‌రైజర్స్ జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా 300 కొడుతుందని అందరూ భావించారు. అయితే తొలి మ్యాచ్ మినహా.. సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో పదే పదే విఫలమవుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం జట్టు పేలవ బ్యాటింగ్ లైనప్.
ముఖ్యంగా కావ్య మారన్ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి టాప్ 3 ప్లేయర్స్‌ను కొనుగోలు చేసింది. వారందరూ కూడా నిరాశపరిచారు. ఆ ముగ్గురే – ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్, భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. హెడ్, అభిషేక్‌లను రూ.28 కోట్లతో అట్టిపెట్టుకుంటే.. మెగా వేలంలో ఇషాన్ కిషన్‌పై రూ.11.25 కోట్లు వెచ్చించింది కావ్య మారన్.
ఈ సీజన్ మొదటి మ్యాచ్ తప్ప, ముగ్గురు బ్యాటర్లు ఆ తర్వాత వరుసగా పేలవ ప్రదర్శనలు కనబరిచారు. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో ఇషాన్ 106 పరుగుల పేలుడు ఇన్నింగ్స్ ఆడగా.. హెడ్ 67 పరుగులు, అభిషేక్ 24 పరుగులు చేశాడు. దీని తర్వాత మ్యాచ్‌లలో ఈ ముగ్గురు ఘోరంగా విఫలమయ్యారు. తర్వాతి 4 ఇన్నింగ్స్‌లలో హెడ్ కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్, ఇషాన్ పరిస్థితి కూడా ఇంతే. ఈ 4 ఇన్నింగ్స్‌లలో అభిషేక్ 27 పరుగులు చేయగా, ఇషాన్ కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..