
ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే మసాలా దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులు అద్భుతమైన ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. రుచిలో కాస్త చేదుగా ఉండే ఈ మెంతులులో క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెంతులలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, మెంతులు కూడా మొలకలుగా చేసుకుని తీసుకుని తింటే రెట్టింపు లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
రోజూ ఉదయం పరగడుపున మెంతులు మొలకలుగా చేసుకుని తినడం వల్ల జ్వరం, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సిస్టమ్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త సరఫాను మెరుగుపరుస్తాయి. పీరియడ్స్ సమయంలో క్రాంప్స్ నొప్పులను తగ్గిస్తుంది. మెంతి మొలకలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి దాంతో గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. దాంతో బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
మధుమేహం వ్యాధిగ్రస్తులకు మెంతి మొలకలు ఎంతో ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు.. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అద్భుతంగా నియంత్రిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ ఉదయం పరగడుపున మెంతి మొలకలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య, గ్యాస్ సమస్య పోతుంది. ఇవి మెంతి మొలకలు. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..