- అద్దెదారుడితో భార్య అక్రమ సంబంధం..
- వ్యక్తిని సజీవంగా పాతిపెట్టిన భర్త..

Illicit affair: ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేని ఓ భర్త దారుణంగా హత్య చేశాడు. హర్యానాలోని రోహ్‌తక్‌లోని వ్యక్తిని తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, ఆపై పొలంలో 7 అడుగుల గొయ్యి తీసి సజీవంగా పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. యోగా గురువుగా ఉన్న వ్యక్తి హత్య గతేడాది డిసెంబర్‌లో జరిగింది. అయితే, పోలీసులు సుదీర్ఘ దర్యాప్తు తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి, సోమవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Lava Shark: లావా ఇంటర్నేషనల్ షార్క్ పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ విడుదల
రోహ్‌తక్‌లోని బాబా మస్త్‌నాథ్ యూనివర్సిటీలో యోగా బోధించే జగ్‌దీప్ అనే వ్యక్తి హరిదీప్ భార్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. జగ్‌దీప్ హరిదీప్ ఇంట్లోని ఒక పోర్షన్‌లో అద్దెకు ఉంటున్నాడు. తన భార్యతో జగ్‌దీప్‌కి అక్రమ సంబంధం ఉందని గ్రహించిన హరిదీప్ అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. చార్ఖీ దాద్రిలోని పాంటవాస్ గ్రామంలో 7 అడుగుల గొయ్యిని ముందే తవ్వించాడు. బోర్‌వెల్ కోసం అని చెప్పి, కార్మికులకు ముందుగానే డబ్బులు చెల్లించి, తవ్వించాడు.
డిసెంబర్ 24న హర్‌దీప్, అతడి స్నేహితులు జగ్దీప్‌ని కిడ్నాప్ చేశారు. జగ్‌దీప్ కాళ్లు, చేతులు కట్టి తీవ్రంగా కొట్టారు. అంతకుముందే తవ్వించిన గుంతలో జగ్‌దీప్‌ని సజీవంగా పారేసి, మట్టితో కప్పేశారు. హత్య జరిగిన 10 రోజుల తర్వాత జనవరి 3న శివాజీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన వ్యక్తి ఫిర్యాదు నమోదైంది. కొంత కాలం తర్వాత జగ్‌దీప్ కాల్ రికార్డుల్ని యాక్సెస్ చేసిన తర్వాత హర్దీప్, అతడి స్నేహితుడిలో ధరంపాల్‌ని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత హత్య వివరాలు తెలిశాయి. హత్య జరిగిన సరిగ్గా మూడు నెలల తర్వాత, మార్చి 24, సోమవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం పూర్తయిందని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యూనిట్ ఇన్‌చార్జ్ కుల్దీప్ సింగ్ అన్నారు