South Central Railway: టికెట్‌ సొమ్ము వాప్‌సకు 3 రోజులే గడువు

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 18 , 2025 | 05:31 AM

వివిధ సందర్భాల్లో రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులు తమ టికెట్‌ సొమ్ము ను మూడు రోజుల్లోగా వాపసు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

South Central Railway: టికెట్‌ సొమ్ము వాప్‌సకు 3 రోజులే గడువు

  • రద్దయిన రైళ్ల ప్రయాణికులకు ద.మ రైల్వే సూచన

  • ఆన్‌లైన్‌ టికెట్ల సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మార్చి17 (ఆంధ్రజ్యోతి): వివిధ సందర్భాల్లో రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులు తమ టికెట్‌ సొమ్ము ను మూడు రోజుల్లోగా వాపసు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రిజర్వేషన్‌ కౌంటర్లలో టికెట్‌ తీసుకున్న వారు సొమ్ము వాపసు కోసం తమ టికెట్‌ను రిజిర్వేషన్‌ కౌంటర్‌లో అందజేయాల్సి ఉం టుందని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ ద్వారా తీసుకున్న ఇ-టికెట్లు అయితే వాటంతటవే రద్దవుతాయని, ఎటువంటి క్యాన్సిలేషన్‌ చార్జీలు మినహాయింపు లేకుండా మొత్తం సొమ్ము ప్రయాణికుల బ్యాంకు ఖాతాకు జమవుతుందని పేర్కొన్నారు.

భారీ వర్షాలు, వరదలు, బంద్‌లు, రైల్‌రోకో వంటిశాంతిభద్రతల సమస్యలు తలెత్తినపుడు అనివార్యంగా రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు. కాగా, ఇటీవల సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయ డం, మరికొన్నింటిని దారిమళ్లించాల్సి వచ్చిందని సీపీఆర్‌వో శ్రీధర్‌ పేర్కొన్నారు.

Updated Date – Mar 18 , 2025 | 05:31 AM

Google News

Subscribe for notification