Sleeping : అతిగా నిద్రపోతున్నారా..?

Written by RAJU

Published on:

Too Much Sleep Can Lead To Many Health Problems

చాలా మంది కాస్త సమయం దొరికితే చాలు ఒక కునుకు తీయాలని చూస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి నిద్ర ఎంతో అవసరం.  కొంతమంది సరైన నిద్ర లేకపోవడం వలన ఎంతో బాధపడుతూ ఉంటే, మరికొందరు ఎక్కువ సమయం నిద్రపోవడం వలన కూడా బాధపడుతున్నారు. కానీ రోజుకు 7 నుంచి 9 గంటల కంటే ఎక్కువ నిద్రించే వారికి అనేక రకాల సమస్యలు వెంటాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అతిగా నిద్ర పోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఈ సమస్యను హైపర్సోమ్నియా అని అంటారు. ఎప్పుడైతే నిద్రలో మార్పులు వస్తాయో జీవన విధానం మారిపోతుందట.మరి ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: Sabdham : ‘శబ్దం’ మూవీ పై మంచు మనోజ్ రివ్యూ..?

1. నిద్రలో ఉన్నప్పుడు శారీరక శ్రమ ఉండదు. బాడీ మొత్తం కూడా ఫుల్ రెస్ట్ లో ఉంటుంది. ఇందు వలన నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు రోజంతా ఎంతో బద్ధకంగా,నీరసంగా అనిపిస్తుంది. అస్సలు యాక్టివ్‌గా ఉండాలని అనిపించదు. ఈ విధంగా శరీరంలో మెటబాలిజం తగ్గిపోతుంది. బరువు కూడా త్వరగా పెరిగిపోతారు. అతిగా నిద్ర పోవడం వలన మెదడు పనితీరు కూడా సరిగా ఉండదు. దీంతో జ్ఞాపకశక్తి  సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

2. ఎక్కువ సమయం నిద్రపోవడం వలన హృదయ సంబంధిత సమస్యలు, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బెడ్‌పై ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాలు అలసటకు గురవుతాయి. ఇంకా స్లీపింగ్ పొజిషన్‌ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కండరాలు నొప్పి మరింత తీవ్రంగా మారుతుంది. ఈ కారణాలతో మీరు వెన్నునొప్పి బారిన పడే ప్రమాదం ఉంది.

3. నిద్రలేమి సమస్య వల్ల డిప్రెషన్ ఎక్కువగా వస్తుంటుందని మనకు తెలిసిందే. అయితే అతి నిద్ర వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 15% మందిలో అధిక నిద్ర వల్ల డిప్రెషన్ వస్తున్నట్లు ఇటీవల జరిగిన పలు అధ్యాయనాల ద్వారా వెల్లడైంది. అంతే కాదు అతినిద్ర దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ రుగ్మతకు కారణమవుతుందట. వీక్ ఎండ్ వచ్చింది అంటే చాలు అందరూ నిద్ర‌కే పరిమితం అవుతున్నారు. ఒంటి గంటకు నిద్రలేవడం తినడం మలి పడుకుని సాయంత్రం లేవడం చేస్తున్నారు. అంతగా నిద్రపోవడం కూడా మంచిది కాదు.

4. అతి నిద్ర వల్ల రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే శక్తి క్షీణిస్తోంది, శరీరంలో ‘కాగ్నిటివ్‌ ఫంక్షనింగ్‌’ తగ్గుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రిపూట తొమ్మిది గంటలకు పైగా నిద్రపోయేవారు.. ఉదయాన్నే లేవడానికి బద్దకిస్తారు. దీంతో రోజంతా అలసటగానే ఫీలవుతుంటారు. యాక్టివ్ గా ఉండాలి అనుకున్న కూడా ఉండలేరు.

5. మరి అలసటగా అనిపించి పట్టలేనంతగా నిద్ర వస్తే పడుకోకుండా ఉండటం కొంచెం కష్టం కానీ. అలాంటప్పుడు టీవీ చూడటం లేదా, వాకింగ్ చేయడం, లేదా ఇంట్లో ఏదైనా పనిలో పడడం చేయండి. మూవీస్ చూడండి, బయటకు వెళ్లి రండి. అలా చేయడం మూలంగా నిద్ర పోకుండా ఉండవచ్చు. హుషారుగా కూడా ఉంటారు. ఫ్యామిలతో కానీ ఫ్రేండ్స్‌తో కానీ టైం స్పెండ్ చేయండి. దీని వల్ల అలసట తగ్గుతుంది.

Subscribe for notification